నాన్న పోయాక నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఆ ధైర్యం చేయలేక పోయాను  

  • తెలుగు ప్రముఖ దర్శకుల్లో ఒకప్పుడు ఈవీవీ గారి పేరు ప్రధమ వరుసలో ఉండేది. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో పాటు ఎమోషన్‌ చిత్రాలను కూడా అద్బుతంగా తెరకెక్కించడంలో దిట్ట అటువంటి ఈవీవీ గారి వారసుడు ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా పరిచయం అవుతున్నాడనగానే అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

  • Aryan Rajesh Says His Character In Vinaya Vidheya Rama Movie-Aryan Aryan About Father Evv Family Satya Narayana Hero Prashanth Ram Charan Movie

    Aryan Rajesh Says His Character In Vinaya Vidheya Rama Movie

  • కాని ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా సక్సెస్‌ కాలేక పోయాడు. తండ్రి ఉన్నంత కాలం ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా డొలుపుకు వచ్చాడు. కాని ఎప్పుడైతే ఈవీవీ గారు చనిపోయారో అప్పుడే ఆయన కెరీర్‌ మసక బారిపోయింది. తాజాగా ఆర్యన్‌ రాజేష్‌ ‘వినయ విధేయ రామ’ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

  • Aryan Rajesh Says His Character In Vinaya Vidheya Rama Movie-Aryan Aryan About Father Evv Family Satya Narayana Hero Prashanth Ram Charan Movie
  • నేడు వినయ విధేయ రామ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా ఆర్యన్‌ రాజేష్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. నాన్నగారు నన్ను పెద్ద హీరోను చేయాలని చాలా ప్రయత్నించారు. కాని ఆయన మరియు కొందరు నాతో చేయించిన సినిమాల వల్ల నా కెరీర్‌ ముందుకు సాగకుండా పోయింది. ఎవరైనా సక్సెస్‌ కోసమే సినిమాలు చేస్తారు. కాని ఆ నిర్ణయాల పర్యావసానం ఏంటో సినిమా విడుదలైతే కాని తెలియదు. నాన్నగారి దర్శకత్వంలో కొన్ని సినిమాలు నేను చేయవద్దనుకున్నాను. కాని నాన్న మాట కాదనలేక సినిమాకు కమిట్‌ అయ్యాను. ఇక నాన్న చనిపోయాక నాతో ఎవరు సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు.

  • నాన్న వల్ల సాయం పొంది డబ్బు సంపాదించిన ఎంతో మంది నన్ను పట్టించుకోలేదు. నేను వెళ్లి వారిని సంప్రదించినా కూడా నాతో సినిమాకు వెనకడుగు వేశారు. ప్రతి ఒక్కరు ఇక్కడ డబ్బు కోసం పని చేస్తారు. నేను నిర్మాతగా మారి సినిమాలు చేయాలనుకున్నా, నేను హీరోగా నా నిర్మాణంలో సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో పూర్తిగా నమ్మకం లేదు. అందుకే సొంత సినిమాలకు ధైర్యం చేయలేక పోయాను. రీ ఎంట్రీతో ఆకట్టుకుంటానని, తప్పకుండా ఈ చిత్రం తర్వాత వరుసగా క్యారెక్టర్‌ రోల్స్‌ వస్తాయని ఆర్యన్‌ రాజేష్‌ పేర్కొన్నాడు.