బెయిల్ వచ్చినా బయటకు రాని ఆర్యన్ ఖాన్.. రంగంలోకి జూహీ చావ్లా?

అక్టోబర్ 3వ తేదీన డ్రగ్ కేసులో భాగంగా అరెస్టయిన ఆర్యన్ ఖాన్ గత ఇరవై రోజుల నుంచి జైలులోనే ఉన్నారు.ఈ క్రమంలోనే రెండుసార్లు కోర్టు అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

 Aryan Khan Will Not Come Out Even If He Gets Bail And Juhi Chawla Is On Filed De-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎలాగైనా తన కొడుకును బయటకు తీసుకురావాలని షారుక్ ఖాన్ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అడ్వకేట్ ను రంగంలోకి దిగడంతో ముంబై హైకోర్టులో ఊరట లభించింది.ఈ క్రమంలోనే వాదోపవాదాలు విన్న న్యాయస్థానం షారుక్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది.

గురువారం విచారణలో భాగంగా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలోనే లీగల్ టీం బెయిల్ పత్రాలను జైలు అధికారులకు సమర్పించకపోవడంతో ఆర్యన్ విడుదలకు మరింత ఆలస్యం అవుతుంది.

ఈ క్రమంలోనే శుక్రవారం విడుదల కావాల్సిన ఆర్యన్ బెయిలు వచ్చిన లీగల్ టీం పత్రాలను జైలు అధికారులకు సరైన సమయంలో అందించకపోవడంతో శుక్రవారం కూడా ఆర్యన్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.లీగల్ టీం పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఆర్యన్ మరొక రోజు జైల్లో ఉండాల్సి ఉంటుంది.

అయితే శనివారం మరి కొన్ని గంటలలో ఆర్యన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Telugu Aryan Khan, Bollywood, Drug, Juhi Chawla, Juhichawla, Sharukh Khan-Movie

ఆర్యన్ ఖాన్ బెయిల్ కి జామీనుగా ఉన్నటువంటి జూహీ చావ్లా ఫోటోలు బెయిల్ పేపర్ ఫార్మాలిటీస్ పై అతికించాల్సి ఉంది.అయితే ఆమె ఫొటోలు లీగల్ టీం అధికారుల దగ్గర లేకపోవడంతో ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం మరింత ఆలస్యం అయ్యింది.దీంతో శుక్రవారం గడువు ముగిసిన తరువాత బెయిల్ పేపర్ తీసుకొని జైలు అధికారుల దగ్గరకు వెళ్లడంతో కోర్టు అధికారి లీగల్ టీం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్ణీత గడువులోగా బెయిల్ పేపర్ సమర్పించక పోవడంతో ఆర్యన్ ను శుక్రవారం కాకుండా శనివారం మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి అతనిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube