తల్లితండ్రులను చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్ ఖాన్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కొన్ని రోజుల కిందట డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే.ఇతడితో పాటు మరో ఎనిమిది మంది కూడా అరెస్ట్ అయ్యారు.

 Aryan Khan Cries During Video Call Shah Rukh Khan And Gouri Khan-TeluguStop.com

ప్రస్తుతం అతను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీలో ఉన్నాడు.ఇక గత కొన్ని రోజుల నుండి ఇతడి బెయిల్ గురించి హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా తన తల్లి తండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 Aryan Khan Cries During Video Call Shah Rukh Khan And Gouri Khan-తల్లితండ్రులను చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా ముంబై కోర్టు తనకు తన తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించారు.

ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తండ్రి షారుక్ ఖాన్, తల్లి గౌరీ ఖాన్ తో కాసేపు మాట్లాడాడు.ఆర్యన్ తన తల్లిదండ్రులను చూడగానే ఒకేసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గతంలో తన కొడుకు కోసం గౌరీ ఖాన్ తన కొడుకు అక్కడ ఏం తింటున్నాడో అని అతనికి ఇష్టమైన బర్గర్ తినిపించాలని అనుకుంది.

Telugu Aryan Khan, Bollywood, Gouri Khan, Sharukh Khan-Movie

కానీ అక్కడి అధికారులు ఆమెను అడ్డుకున్నారు.బయట ఫుడ్ లోనికి అనుమతించమని చెప్పడంతో తన కొడుకుని చూడటానికి కూడా అవకాశం దక్కకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయింది.ఇక మొత్తానికి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా కాస్త వాళ్ళ మనసు కుదుటపడినట్లు అనిపించింది.

ఇక ఆర్యన్ గత కొన్ని రోజుల నుండి ఈ జైల్లో ఉండగా అతడి బెయిల్ కు అధికారులు నిరాకరిస్తున్నారు.సెలబ్రెటీల పిల్లల అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వరని చట్టంలో లేదు అంటూ అతడి తరఫున మరో లాయర్ వాదించారు.

#Aryan Khan #Sharukh Khan #Gouri Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube