కూష్మాండ విలన్‌ను కొట్టేందుకు రెడీ అవుతున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

 Arya To Play Villain In Allu Arjun Pushpa, Arya, Allu Arjun, Pushpa, Tollywood N-TeluguStop.com

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది.కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే బన్నీతో ఢీకొట్టే విలన్ పాత్రలో తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి వాకౌట్ చేశాడు.

దీంతో పుష్ప చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించిన సుకుమార్ ఎవరినీ ఫైనల్ చేయలేదట.

కాగా తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ తమిళ హీరో ఆర్యకు ఇచ్చినట్లు తెలుస్తోంది.తమిళంలో మంచి గుర్తింపు ఉన్న ఈ హీరో, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

కాగా గతంలో బన్నీ నటించిన వరుడు చిత్రంలో ఆర్య విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.దీంతో ఇప్పుడు మరోసారి ఆర్యను విలన్ పాత్ర కోసం సంప్రదించారట చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాలో నటించే విషయంపై ఇంకా ఆర్య తన నిర్ణయాన్ని వెల్లడించలేదట.వరుడు చిత్రంలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆర్య, మరోసారి బన్నీతో తలబడితే చూడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

ఇక పుష్ప చిత్రంలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ను మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లనుంది.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube