కూతురుకు అరియానా అని పేరు పెట్టిన ఆర్య.. ఆ పేరు మీనింగ్ ఏంటంటే?

తెలుగులో నేనే అంబానీ, రాజారాణి సినిమాల ద్వారా హీరో ఆర్య పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాసినిమాకు ఆర్య క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

 Arya Sayyeshaa Announce The Name Of Their Baby Girl On Daughter Daymeaning Of That Name-TeluguStop.com

ఆర్య ప్రముఖ నటి సాయేషా సైగల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగులో అఖిల్ సినిమాలో నటించిన సయేషా సైగల్ తమిళంలో గజినీకాంత్ అనే సినిమాలో కలిసి నటించారు.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భలే భలే మగాడివోయ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆర్య, సయేషా ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.

 Arya Sayyeshaa Announce The Name Of Their Baby Girl On Daughter Daymeaning Of That Name-కూతురుకు అరియానా అని పేరు పెట్టిన ఆర్య.. ఆ పేరు మీనింగ్ ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత కాలంలో పెద్దలను ఒప్పించి ఆర్య, సయేషా వివాహం చేసుకున్నారు.జులైలో ఆర్య, సయేషా దంపతులకు కూతురు జన్మించగా ఆ కూతురుకు అరియానా అనే పేరు పెట్టారు.

ఆ పేరు గురించి ఆర్య స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

డాటర్స్ డే సందర్భంగా కూతురుకు పేరు పెట్టిన ఆర్య అరియానా అంటే స్వచ్చమైనది లేదా పవిత్రమైనది అని అర్థం వస్తుందని ఆర్య చెప్పుకొచ్చారు.

Telugu Ariyana, Ariyana Name Meaning, Arya, Arya And Sayyesha Daughter Name, Baby Name, Hero Arya Daughter, Interesting Facts, Sayyeshaa, Shaheen-Movie

గ్రీకు పదం నుంచి ఈ పేరు పుట్టిందని ఆమె వెల్లడించారు.సాయేషా తల్లి షాహీన్ సోషల్ మీడియాలో తన కూతురు పేరు గురించి స్పందిస్తూ తన మనవరాలి పేరు అరియానా అని మనవరాలి వయస్సు రెండు సంవత్సరాలు అని చెప్పుకొచ్చారు.

Telugu Ariyana, Ariyana Name Meaning, Arya, Arya And Sayyesha Daughter Name, Baby Name, Hero Arya Daughter, Interesting Facts, Sayyeshaa, Shaheen-Movie

తన కూతురు సాయేషకు అరియానా అనే పేరు చాలా బాగా నచ్చిందని షాహీన్ వెల్లడించారు.త్వరలోనే మనవరాలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని షాహీన్ పేర్కొన్నారు.సోషల్ మీడియా ఫాలోవర్ల దీవెనలు, ఆశీస్సులు మనవరాలికి కావాలని షాహీన్ వెల్లడించారు.అరియానా అనే పేరు బాగుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం గమనార్హం.

#Shaheen #Baby #Arya Sayyesha #Arya #Sayyeshaa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు