విశాల్ కి విలన్ గా మారబోతున్న ఆర్య

సౌత్ సినిమాలో తమిళ హీరోలు శైలి భిన్నంగా ఉంటుంది.ఓ వైపు హీరోలుగా నటిస్తూనే ఇతర హీరోల సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు.

 Arya And Vishal To Reunite For Anand Shankar's Action-thriller, Tollywood, Kolly-TeluguStop.com

అలాగే కీలక పాత్రలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.విశాల్ తమిళంలో స్టార్ హీరో అయిన మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో విలన్ గా నటించాడు.

విజయ్ సేతుపతి కూడా తెలుగులో ఉప్పెనలో విలన్ గా నటించాడు.అలాగే తమిళంలో స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు.

అలాగే హీరో ఆర్య కూడా రెగ్యులర్ కి భిన్నంగా తన కెరియర్ కొనసాగిస్తున్నారు.తమిళంలో హీరోగా మంచి ఊపు మీద ఉన్నప్పుడే తెలుగులో వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.

అలాగే బాల దర్శకత్వంలో విశాల్ తో కలిసి వాడు-వీడు అనే సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాడు.ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది.

ఈ సారి మాత్రం విశాల్ కి ప్రతినాయకుడుగా ఆర్య కనిపించబోతున్నాడు. ఆనంద్‌శంకర్‌ దర్శకత్వంలో వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రంలో విశాల్ తో తలపడే పవర్ ఫుల్ పాత్రలో ఆర్య సందడి చేయబోతున్నాడు.

ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆర్య పాత్ర కూడా హీరో రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్‌శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగులో గద్దలకొండ గణేశ్‌ చిత్రంతో నటించిన మృణాళిని నటించనుంది.వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

తెలుగు, తమిళ బాషలలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube