టాలీవుడ్‌ స్టార్స్‌ పరువు తీసిన కోలీవుడ్‌ ప్రేమ జంట  

Arya And Sayesha Saigal\'s Sangeeth Ceremony In Hyderabad-hyderabad,sangeeth Ceremony,tollywood Stars

కోలీవుడ్‌ హీరో ఆర్య, హీరోయిన్‌ సాహేషా సైగల్‌ లు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఆ అంగీకారంతో పెళ్లి జరిగింది...

టాలీవుడ్‌ స్టార్స్‌ పరువు తీసిన కోలీవుడ్‌ ప్రేమ జంట-Arya And Sayesha Saigal's Sangeeth Ceremony In Hyderabad

నిన్న, నేడు హైదరాబాద్‌లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు తమిళ నటీనటులు కూడా పాల్గొన్నారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్‌ స్టార్స్‌ ఎవరికి కూడా ఆహ్వానం అందక పోవడం ఆశ్చర్యంగా ఉంది.

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌తో పాటు ఇంకా పలువురు సంగీత్‌ కార్యక్రమంలో డాన్స్‌లు చేయడం, సందడి చేయడం వంటి వీడియోలు మరియు ఫొటోలు ఆకట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోల్లో ఎక్కడ చూసినా కూడా టాలీవుడ్‌ వారు కనిపించడం లేదు.

ఆర్య మరియు సాహేషా సైగల్‌ లు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. టాలీవుడ్‌కు చెందిన పలువురితో వారికి స్నేహం ఉంది. అయినా ఎందుకు పెళ్లికి పిలవలేదు అనే చర్చ జరుగుతుంది.

తమిళనాడు నుండి మరియు ముంబయి నుండి హైదరాబాద్‌కు పలువురు స్టార్స్‌ వచ్చిన నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రమే పెళ్లికి హాజరు కాకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఆర్య, సాహేషాలు టాలీవుడ్‌ వారిని ఎందుకు పెళ్లికి ఆహ్వానించలేదు అనేది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న విషయం. అయితే ఈ విషయంపై అసలు ఇంత చర్చ అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌గా వారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

కొద్ది మందిని మాత్రమే పిలిచి ఉంటారు అని సినీ వర్గాల వారు అంటున్నారు.