థియేటర్స్ విషయంలో ఆ నిర్ణయాన్ని తప్పు పడుతున్న అరవింద్ స్వామి

కరోనా లాక్ డౌన్ తర్వాత మరల థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.దీనికీ కూడా కొన్ని కండీషన్స్ పెట్టింది.

 Arvind Swami Against 100 Percent Occupancy, Kollywood, Tamil Nadu, Tollywood, Ma-TeluguStop.com

సాఫ్ట్ మెథడ్స్ ఉపయోగిస్తూ ప్రేక్షకులకి అనుమతి ఇవ్వాలని సూచించింది.అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడం కష్టం అని చాలా మంది ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడలేదు.

ఏపీలో గత నెల నుంచి థియేటర్స్ చేశారు.చాలా వరకు మల్టీప్లెక్స్ వరకు ముందుగా ఓపెన్ అయ్యాయి.

సోలో బ్రతుకే సినిమాతో చాలా వరకు థియేటర్స్ ఓపెన్ అయిపోయాయి.ఇక ఫెస్టివల్ కి ఏకంగా 3 నుంచి 5 సినిమాల వరకు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి.

ఈ నేపధ్యంలో సంక్రాంతి సినిమా సందడి ఫుల్ గా ఉండబోతుంది.వచ్చే నాలుగు నెలలు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.

ఈ నేపధ్యంలో ఆక్యుపెన్సీ పెంచాలని థియేటర్స్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది.

త్వరలో విజయ్ మాస్టర్ మూవీ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ నిర్ణయాన్ని మెజారిటీ సెలబ్రెటీలు స్వాగతించిన కొంత మంది మాత్రం తప్పు పడుతున్నారు.వారిలో అరవింద్ స్వామి కూడా ఉన్నారు.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టాడు.

కొన్ని సందర్భాల్లో వంద శాతం కంటే 50 శాతమే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది.ఇది అలాంటి సమయమే” అని అరవింద్ స్వామి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.దేశంలో ముంబై తర్వాత ఆ స్థాయిలో కరోనా ప్రభావం ఉన్న పట్టణాలలో చెన్నై టాప్ లో ఉండేది.

అలాగే కేసుల విషయంలో కూడా తమిళనాడులో భారీగా నమోదయ్యాయి.ఇప్పటికి కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టలేదు.

అయితే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.అయినా ఇలాంటి సమయంలో 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడం వలన ప్రజారోగ్యంతో ఆటలు ఆడుకుంటున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ నేపధ్యంలో అరవింద్ స్వామి వాఖ్యలు వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube