కేజ్రీవాల్ ని తక్షణం అరెస్ట్ చేయాలి... సోషల్ మీడియాలో డిమాండ్

కరోనా దేశంలో విలయతాండవం చేయడానికి రెడీ అవుతుంది.దానిని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుంది.

 Arvind Kejriwal Urges Migrant Workers Leaving Delhi To Stay Back, Corona Effect,-TeluguStop.com

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దని ప్రకటించింది.ఇక దానికి తగ్గట్లే దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు.

అయితే సిటీలలో ఉన్న వలస కూలీలకి పని ఉంటెనే తిండి దొరుకుతుంది.లేదంటే పస్తులు ఉండాలి.

ఇప్పుడు పని లేకపోవడం తప్పనిసరి పరిస్థితిలో వారంతా కాలినడకన సొంత ఊళ్ళకి ప్రయాణం అయ్యారు.ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా ఎక్కువగా ఉంది.

ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.రోడ్లపై వేల సంఖ్యలో ఉన్న వలల కూలీల ఫోటోలు తీసి క్రేజేవాల్ లాక్ డౌన్ ని అమలుచేయడంలో విఫలం అయ్యాడని అంటున్నారు.

తక్షణం అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఢిల్లీలో వేల మంది ప్రజలు గుంపులుగా కనిపిస్తున్నారు.వలస కార్మికులు, పేదలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సు సదుపాయాలు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్లపైనా, బస్టాండ్ల దగ్గరా జీవిస్తున్నారు.ఇదే సమస్య అవుతోంది

ఢిల్లీలో ప్రజలు సమూహాలుగా ఉంటే, సామాజిక దూరం పాటించకపోతే కరోనా వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందనీ, అది మళ్లీ దేశవ్యాప్తంగా వైరస్ పెరిగేందుకు కారణం అవుతుందని చాలా మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ పెరిగేందుకు పరోక్ష కారణం అవుతున్న కేజ్రీవాల్‌ని అరెస్టు చెయ్యాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రానికి సీఎం అయివుండీ… కేజ్రీవాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube