ఢిల్లీలో ప్రత్యర్థులను ఊడ్చేస్తున్న కేజ్రీవాల్ పార్టీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తాను చాటుకుంటోంది.దాదాపు విజయం దిశగా ఆ పార్టీ అడుగులు వేయడంతో ఆప్ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచ పేల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.53 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.బిజెపి 16 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారకా, క్రిష్ణ నగర్ లో బిజెపి ముందంజలో ఉంది.సీఎం క్రేజీవాల్ తన ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే యాభై నాలుగు స్థానాల్లో ఆప్ ముందంజలో ఉండడంతో దాదాపు ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

 Arvind Kejriwal Lead In Elections Counting-TeluguStop.com

ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు జెండా ఎగురవేయాలని తహతహలాడిన బీజేపీకి ఈ ఫలితాలు నిరాశ కలిగించేలా కనిపిస్తున్నాయి.క్రేజివాల్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ముందుగానే ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి.

దానికి తగినట్టుగానే ఇప్పుడు కౌంటింగ్ రిజల్ట్స్ బయటపడుతున్నాయి.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.ఢిల్లీలో బిజెపి హవా నడుస్తుందా లేక ఆప్ పార్టీ హవా నడుస్తుందా అంటూ మిగతా రాజకీయ పార్టీలన్నీ ఈ ఫలితాల మీద దృష్టి కేంద్రీకరించాయి.

Telugu Arvind Kejriwal, Delhi-

ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి విడతలో భాగంగా బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.ఢిల్లీలో మొత్తం 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు.దాదాపుగా ఆ పార్టీకి అధికారం దక్కేలా ఫలితాలు వస్తుండడంతో బిజెపిలో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోలేక పోయామనే బాధ బిజెపి అగ్ర నాయకులలో నెలకొంది.

ముఖ్యంగా క్రేజివాల్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శకమైన పరిపాలన ఇవన్నీ ఆప్ పార్టీకి కలిసి వచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube