మొన్న రాహుల్ కు నిన్న కేజ్రీవాల్ కు!  

Arvind Kejriewal Got Bail In Defamation Case-

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి ఊరట లభించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా పరువునష్టం కేసులో ఊరట లభించింది.గత ఎన్నికల సమయంలో భాజపా ఆరోపణలు చేసిన కేజ్రీ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే...

Arvind Kejriewal Got Bail In Defamation Case--Arvind Kejriewal Got Bail In Defamation Case-

అయితే దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం కేజ్రీ కోర్టుకు హాజరుకావాల్సింది గా కోరడం తో ఆయన కోర్టు కు హాజరయ్యారు.అయితే విచారణ ముగిసిన అనంతరం కోర్టు ఈ కేసు లో కేజ్రీ కి ఊరట కల్పించింది.10,000 వ్యక్తిగత బాండ్ కింద ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ భారీ ఊరట నిచ్చింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపాపై కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఓటర్ల జాబితా నుంచి భాజపా కొందరి పేర్లు తొలగించిందని సీఎం దుయ్యబట్టారు.

Arvind Kejriewal Got Bail In Defamation Case--Arvind Kejriewal Got Bail In Defamation Case-

మరోపక్క సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా నేతలు పార్టీ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత రాజీవ్‌ బబ్బర్‌, కేజ్రీవాల్‌ సహా మరి కొందరు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేశారు.అయితే ఈ కేసునుంచి ఊరట పొందిన కేజ్రీ పలు పరువునష్టం కేసులను ఎదుర్కొంటున్నారు.ఆమ్‌ ఆద్మీ చీఫ్‌ హత్యకు భాజపా కుట్ర పన్నుతోంది అంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో భాజపా నాయకుడు విజయేందర్‌ గుప్తా.

సీఎం, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాలపై పరువు నష్టం దావా వేశారు.