అరుంధతి తండ్రి మీకు గుర్తున్నారా.. ఆయన కొడుకులు హీరోలే అని తెలుసా?

స్టార్ హీరోయిన్ అనుష్క సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.అయితే ఇతర సినిమాలతో పోలిస్తే అరుంధతి సినిమా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు అనుష్క సినీ కెరీర్ లో ప్రత్యేక సినిమాగా నిలిచింది.

 Arundathi Movie Father Character Shankar Sons Also Heroes In Telugu Movies, Arun-TeluguStop.com

అనుష్క ఎంతో ప్రతిభ ఉన్న నటి అని ఆ సినిమా ద్వారానే ప్రేక్షకులకు అర్థమైంది.అరుంధతి సినిమా తర్వాత అనుష్క పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించగా ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి.

అరుంధతి సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.జేజమ్మ పాత్రకు అనుష్క పూర్తిస్థాయిలో న్యాయం చేయగా పశుపతి పాత్రలో సోనూసూద్ అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో ఫ్యాష్ బ్యాక్ సీన్లలో అరుంధతి తండ్రి పాత్రలో శంకర్ అనే నటుడు నటించారు.

సినిమాల ద్వారా, టీవీ సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కు అరుంధతి సినిమాలోని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే ఈ నటుడి కొడుకులు కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటులే కావడం గమనార్హం.

Telugu Arundathi, Baladitya, Anushka Shetty, Krishna Koushik, Oka Gramam, Shanka

బాలాదిత్య, కృష్ణ కౌశిక్ శంకర్ కొడుకులు కాగా బాలాదిత్య బాల నటుడిగా, హీరోగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.మరోవైపు కృష్ణ కౌశిక్ పదుల సంఖ్యలో సీరియళ్లలో నటించి సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.చంటిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలాదిత్య పరిచయం కావడం గమనార్హం.

Telugu Arundathi, Baladitya, Anushka Shetty, Krishna Koushik, Oka Gramam, Shanka

బాలాదిత్య నటించిన 1940లో ఒక గ్రామం అనే మూవీకి అవార్డులు సైతం వచ్చాయి.ప్రస్తుతం బాలాదిత్య పలు టీవీ షోలకు హోస్ట్ గా పలు రియాలిటీ షోలతో బిజీగా ఉన్నారు.కృష్ణ కౌశిక్ సినిమాలలో పరిమితంగా నటించినా బుల్లితెరపై మాతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగానే సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube