వైరల్‌ వీడియో : బెంగళూరు రోడ్డుపై అంతరిక్షం, చందమామ చూపించిన నెటిజన్‌

విదేశాల సంగతి ఏమో కాని ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణంగా ఉంటాయి.హైవేలను అభివృద్ది అయితే చేస్తున్నారు కాని కొన్ని రాష్ట్రీయ రాహదారులను మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.

 Artistwalks Onthebengaluru Roads Likeonthe Moon Anthariksham-TeluguStop.com

స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం పెద్దగా పట్టింపు లేకుండానే ఉంటున్నాయి.తమ రోడ్లను పట్టించుకోండి మహాప్రభో అంటూ ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

తాజాగా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తమ ప్రాంతం రోడ్డు కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఒక ప్రయత్నం చేశాడు.

Telugu Anthariksham, Artistwalks, Chandrayan, Moon-

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియో రచ్చ రచ్చ చేస్తోంది.ఆ వీడియోలో అంతరిక్షంపై ఒక వ్యక్తి నడుస్తున్నట్లుగా ఉంది.ఆ వ్యక్తి అంతరిక్షంలో వాడే సూట్‌ను ధరించడంతో పాటు, అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా అయితే నడుస్తారో అలాగే నడుస్తున్నాడు.

కెమెరా అతడి పై భాగం నుండి తీయడంతో నూటికి నూరు శాతం అతడు ఒక చందమామపైనో లేదంటే ఏదో గ్రహం పైనో తిరుగుతున్నట్లుగా అనిపించింది.అతడు మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ ఉన్న సమయంలో అతడి పక్క నుండి ఆటో వెళ్లడంతో అంతా అవాక్కవుతారు.

ఆ తర్వాత అతడి పక్క నుండి కార్లు కూడా వెళ్తూ ఉన్నాయి.కెమెరాను కాస్త కిందికి దించగా అసలు విషయం అర్థం అవుతుంది.

అది అంతరిక్షం, చందమామ కాదని, అది ఒక గతుకుల రోడ్డు అని తేలిపోయింది.అతడు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అదిరిపోయేలా రెస్పాన్స్‌ దక్కించుకుంది.

వీడియోకు కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల వ్యూస్‌ వచ్చాయి.అద్బుతమైన స్పందన చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం వీడియో చేసిన వ్యక్తి ఎవరా అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాంటి ఐడియా రావడం నిజంగా అద్బుతం అని చెప్పాలి.

వీడియో వైరల్‌ అవ్వడంతో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా మన దేశం గురించి మనం పరువు తీసుకోవడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం ఇలాంటి వీడియోలు తీయడం వల్ల ప్రభుత్వం పరువు తీస్తున్నారు.ఇది ప్రతిపక్షం వారు చేయించారు అంటున్నారు.ఎవరేం అన్నా కూడా బెంగళూరులో ఉన్న రోడ్ల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.కనుక ఖచ్చితంగా ఇది ప్రజలకు మంచి చేసిందని అంటున్నారు.

ఇప్పటికప్పుడే కాకున్నా కొన్ని రోజుల్లోనే బెంగళూరుకు చెందిన ఆ రోడ్లను బాగు చేస్తారని స్థానికులు అంటున్నారు.ఆ వీడియో చేసిన వ్యక్తి గురించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.

అతడి క్రియేటివిటీ మరియు కెమెరా యాంగిల్‌ పెట్టిన విధానంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.మొత్తానికి ఆ వీడియో సోషల్‌ మీడియా జనాలకు నవ్వు తెప్పించడంతో పాటు, ఆలోపింపజేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube