ఆర్టికల్ -359 : దుబాయ్ లో భారతీయ మహిళలకు కొండంత అండ

ప్రస్తుత కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.చట్టాలకు, శిక్షలకు, పోలీసు వ్యవస్థకు భయపడని కొందరు మహిళలపై దాడులు చేస్తూనే ఉన్నారు.

 Article 359 Dubai Woman Harassment-TeluguStop.com

అయితే కేవలం శిక్షలలో మార్పులు చేయడం ద్వారా, కటినమైన శిక్షలను అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చునని అంటున్నారు నిపుణులు.ఈ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ముందడుగు వేసింది.

మహిళలపై దాడులు జరిగినా, కనీసం వారిని మాటలతో దాడి చేసినా సరే కటినమైన శిక్షలను అమలు చేయడానికి సిద్దమయ్యింది.

దుబాయ్ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన చట్టాల కారణంగా ఎంతో మంది మహిళలకు మేలు జరగనుంది.

ముఖ్యంగా భారతీయ మహిళలకు, వివిధ దేశాల నుంచీ వలస వచ్చిన మహిళలకు ఏఎ కొత్త చట్టం కొండంత అండగా నిలబడనుంది.ఆర్టికల్ – 359 ఈ చట్టం పాతదే అయినా ఇందులో మార్పులు చేర్పులు చేసినట్టుగా తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ చట్టం ప్రకారం.ఎవరైనా తమ ప్రవర్తన ద్వారా లేదా మాటల ద్వారా, భౌతికంగా మహిళలపై దాడులు చేసినా వారిని నష్టపరిచినా వారిపై ఆర్టికల్ -359 ప్రకారం కేసులు పెట్టవచ్చు.

ఈ చట్టం ప్రకారం ముద్దాయికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తుంది లేదంటే రూ.20 లక్షలు భారీ జరిమానా విధిస్తుంది.ఒక్కో సారి కేసు తీవ్రతను బట్టి రెండు శిక్షలు పడవచ్చు.దుబాయ్ లో ఉండే ప్రతీ మహిళ ఈ ఆర్టికల్ -359 చట్టం గురించి తప్పకుండా తెలుసుకోవాలని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూట్ ప్రకటించింది.

సోషల్ మీడియాలో ఓ మహిళ దుబాయ్ లో మహిళలపై దాడులు జరిగితే ఎలాంటి శిక్షలు వేసే చట్టాలు అమలులో ఉన్నాయని అడిగిన ప్రశ్నకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూట్ ఈ విధంగా స్పందించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube