చనిపోయిన స్టార్‌ హీరోయిన్‌ బయోపిక్‌కు ఏర్పాట్లు

ఈమద్య కాలంలో బయోపిక్‌లు చాలా కామన్‌ అయ్యాయి.ఎంతో మంది ప్రముఖులపై బయోపిక్‌లు వస్తున్నాయి.

 Web Series On Actress Aarti Agarwal,  Aarti Agarwal,  Aarti Agarwal Biopic,  Aar-TeluguStop.com

మొన్నటి వరకు సినిమాలు మాత్రమే బయోపిక్స్‌ వచ్చేవి.ఇప్పుడు వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వెబ్‌ సిరీస్‌లుగా బయోపిక్స్‌ను తీసుకు వస్తున్నాయి.

జయలలిత బయోపిక్‌కు వెబ్‌ సిరీస్‌గా మంచి పేరు వచ్చింది.అందుకే ప్రస్తుతం సీజన్‌ 2 కూడా రూపొందుతుంది.

ఇదే క్రమంలో ప్రముఖ హీరోయిన్‌ ఆర్తీ అగర్వాల్‌ బయోపిక్‌ కూడా రాబోతుందట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్తి అగర్వాల్‌ బయోపిక్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఆమె కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది.ఆ కారణాలు ఏంటీ అనేవి ఎవరికి తెలియదు.

కాని వాటిని సినిమాలో విశ్లేషించబోతున్నారు.ఇక ఆమె కెరీర్‌ ఆరంభంలో ఒక హీరోతో ప్రేమాయణం సాగించిందనే వార్తలు వచ్చాయి.

ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.మొత్తానికి ఆర్తీ అగర్వాల్‌ కెరీర్‌ మరియు జీవితంలోని అనేక అంశాలను ఈ వెబ్‌ సిరీస్‌లో చూపిస్తారనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

వెబ్‌ సిరీస్‌ కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది.ఒక దర్శకుడు ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేశాడు.

మొదట కొన్ని ఎపిసోడ్స్‌ చిత్రీకరించి వచ్చే స్పందనను బట్టి ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.మీడియం బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ భారీ మొత్తంకు కొనుగోలు చేసేందుకు రెడీగా ఉందట.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో ఆర్తి అగర్వాల్‌ వెబ్‌ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.దీనిని తమిళం హిందీల్లో కూడా డబ్‌ చేస్తారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube