డైరెక్టర్ గా మారుతున్న ఆర్ట్స్ డైరెక్టర్... యూవీ క్రియేషన్స్ లో ఫస్ట్ మూవీ

సినిమా ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్స్, అలాగే కొరియోగ్రాఫర్స్, కెమెరామెన్ లు దర్శకులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇప్పుడున్న చాలా మంది స్టార్ దర్శకులలో గతంలో ఈ విభాగాలలో తమ సత్తా చాటిన వారే.

 Art Director Ravinder Turned As A Director, Tollywood, Uv Creations, Radhe Shyam-TeluguStop.com

అలాగే దర్శకులుగా మారిన నటులు కూడా ఉన్నారు.వారి సినిమా అనుభవంతో కథకుడుగా మారి సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశారు.

అలాగే నటులుగా సక్సెస్ అయిన దర్శకులు కూడా ఉన్నారు.ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా అడుగు పెట్టడానికి అవకాశం దొరికితే దానిని వినియోగించుకొని తమ కలని సాకారం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు.

నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు దర్శకులుగా మారాలని అనుకోని హీరోలుగా సక్సెస్ అయ్యారు.వీళ్ళు ఏదో ఒక రోజు దర్శకత్వం చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇలాగే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కూడా దర్శకుడుగా మారడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మ‌గ‌ధీర‌, ఈగ, ప్రస్తుతం రాదేశ్యామ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఆర్ట్ దర్శకుడుగా పని చేసిన వ్యక్తి రవీందర్.మంచి కళా దర్శకుడుగా ఇండస్ట్రీలో అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

అతను ఇప్పుడు ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడ‌ట‌.ఆ క‌థ‌ నచ్చి ర‌వీంద‌ర్‌ని ద‌ర్శ‌కుడిగా పెట్టి సినిమా చేయ‌డానికి యూవీ క్రియేషన్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అతను యూవీ క్రియేషన్స్ లోనే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాదేశ్యామ్ కి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.ఈ టైంలోనే ర‌వీంద‌ర్ వారికి తన దగ్గర ఉన్న కథ చెప్పడం జరిగినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి బడ్జెట్ తక్కువ కావడంతో తామే నిర్మిస్తామని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు రవీందర్ కి మాట ఇచ్చినట్లు సమాచారం.త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube