గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన హిందూ మహాసభ కార్యకర్తలు....అరెస్ట్  

Arrest Of Hindu Mahasabha Activists Organized By Godse\'s Birthday Celebrations -

ఇటీవల మహాత్మా గాంధీ ని పొట్టన పెట్టుకున్న గాడ్సే కూడా దేవుడు అయిపోయాడు.గాడ్సే ఉత్తముడు అంటూ బీజేపీ పార్టీ లో మెంబర్ అయిన ప్రజ్ఞా సాధు సింగ్ వ్యాఖ్యలు ఇంకా మరువక ముందే గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం తీవ్ర కలకలం సృష్టించింది.

Arrest Of Hindu Mahasabha Activists Organized By Godse's Birthday Celebrations

సూరత్ లోని హిందూ మహాసభ కు చెందిన కొందరు కార్యకర్తలు ఈ పనికి పాల్పడడం తో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

లింబాయత్ ప్రాంతంలోని సూర్య ముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహణలో భాగంగా అతని ఫొటో చుట్టూ దీపాలు వెలిగించి పూజలు కూడా నిర్వహించారు.అంతేకాకుండా ఈ తతంగం అంతా కూడా ఫోటోలు,వీడియో లు కూడా తీయడం తో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇటీవల గాడ్సే ను కీర్తిస్తూ పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఒకరేమో స్వతంత్ర భారతదేశం మొట్ట మొదటి ఉగ్రవాది హిందూ వే నంటూ వ్యాఖ్యానించగా,మరొకరు గాడ్సే మంచి వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు.అయితే ఇంకా ఆ వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం ముగియకుండానే ఇప్పడు తాజాగా గాడ్సే పుట్టిన రోజు వేడుకలు కూడా జరపడం మరింత వివాదానికి దారి తీసింది.ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.

‘మహాత్మ గాంధీని చంపిన నేరస్థుడికి పుట్టిన రోజుల వేడుకలు నిర్వహిచండం నిజంగా చాలా విచారకరం.ఇలాంటి పనులు వల్ల దేశ ప్రజలు మనోభావాలు దెబ్బ తింటాయి.

ఫలితంగా గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది.అందుకే ఈ చర్యలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేశామ’ని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు