బైడెన్ టీమ్‌లోకి మరో ఇండో అమెరికన్ మహిళ.. కీలక బాధ్యతలు అప్పగింత..!!

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన జట్టులో ఇండో అమెరికన్లకు కీలక పదవులు అప్పగిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్‌లోకి మరో భారత సంతతి మహిళ చోటు దక్కించుకున్నారు.ఇండో అమెరికన్ అర్పితా భట్టాచార్యను ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు బైడెన్.

 Arpita Bhattacharyya Named Chief Of Staff To Deputy Secy At Us Dept Of Energy, I-TeluguStop.com

శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతంలో స్ధిరపడిన భట్టాచార్య.కార్లెటన్ కళాశాల, యేల్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.అర్పిత.పర్యావరణం, వాతావరణ మార్పులపై పలు రచనలు కూడా చేశారు.

అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ పునరుత్పాదక సంస్థ సన్‌పవర్ కార్పొరేషన్‌లో పనిచేశారు.ప్రస్తుతం ఆమె మొక్కల నుండి మాంసాన్ని తయారుచేసే ఇంపాజిబుల్ ఫుడ్స్ అనే ఆహార సంస్థలో పనిచేస్తున్నారు.

అంతేగాక సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్‌లో ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ టీం కోసం పాలసీ అనలిస్ట్‌గా కూడా ఆమె పనిచేశారు.

ఇక గతవారం ఇద్దరు భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండేలకు కూడా బైడెన్ కీలక పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

రాహుల్‌ గుప్తాను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్‌గా, అతుల్ గవాండేను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా బైడెన్ నియమించనున్నారు.

భారతీయ దౌత్యవేత్త కుమారుడైన రాహుల్ గుప్తా భారత్‌లో జన్మించారు.

అనంతరం వాషింగ్టన్‌లో ఆయన పెరిగారు.రాహుల్ గుప్తా ప్రజారోగ్య విధానాలపై అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుగా పనిచేస్తున్నారు.

ఎబోలా, జికా వైరస్ వ్యాప్తి సమయంలో దానిని ఎదుర్కోనే బృందానికి నాయకత్వం వహించారు.పటిష్టమైన కార్యాచరణ ద్వారా రెండు వైరస్‌లపై పోరాడారు.

Telugu Atul Gawande, Staffdeputy, Indoamerican, Rahul Gupta, Sanfrancisco-Telugu

ఇక అతుల్ గవాండే విషయానికి వస్తే.ఆయన అరియాడ్నే ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడిగా వున్నారు.కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆయన కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ పనులను నిర్వర్తించిన సీఐసీ హెల్త్‌ను అతుల్ స్థాపించారు.అలాగే జో బైడెన్ ట్రాన్సిషన్ కోవిడ్ 19 అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా అతుల్ పనిచేశారు.

గతంలో 1998 నుంచి ది న్యూయార్కర్ మేగజైన్‌కు స్టాఫ్ రైటర్‌గా వ్యవహరించారు.అలాగే నాలుగు పుస్తకాలను అతుల్ రచించారు.అవి కాంప్లికేషన్స్, బెటర్, ది చెక్‌లిస్ట్ మానిఫెస్టో, మరియు బీయింగ్ మోర్టల్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube