ఈ చేప ఇంట్లో ఉంటే సంపద లభిస్తుందా..?!

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక చేపను ఈశాన్య దిశలో ఉంచితే కలిసి వస్తుందట.సాధారణంగా మనిషి కష్టపడితేనే డబ్బు సంపాదించగలుగుతాడు.

 Fish, Income, House, Positive Energy, Negatie, Good Nees, Health, Happinses,arow-TeluguStop.com

కొందరు కష్టపడకుండానే కోట్ల రూపాయలను సంపాదిస్తారు.వారిని అదృష్టవంతులు అని పిలుస్తుంటారు.

అయితే వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక చేపను ఈశాన్య దిశలో ఉంచితే కలిసొస్తుందని.అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట.

భారతదేశంలో బాగా చదువుకున్నవారు కూడా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు.వాస్తులు పట్టించుకోకుండా ఇల్లు నిర్మించినా.

ఇంకేమైనా పని ప్రారంభించినా చెడు జరుగుతుందని ప్రతి భారతీయుడు నమ్ముతాడు.ఈ స్థాయిలో నమ్మకం ఉంది కాబట్టే ప్రస్తుతం చేప గురించి చెప్పే వాస్తు శాస్త్రాన్ని కూడా చాలామంది నమ్ముతున్నారు.

అందుకే ఈ చేప కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది.


ఇంతకీ పట్టిందల్లా బంగారం కావాలంటే ఏ చేపను ఈశాన్య దిశలో పెంచాలంటే.

ఎరోవానా చేప (Arowana fish).వాస్తు నిపుణులు సూచిస్తున్న ఈ చేపలు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో విక్రయించబడుతున్నాయి.ఒక్క చేప ఖరీదు 1000 పలుకుతుంది.ఎరోవానా చేపను ఇంట్లో ఎక్వేరియంలో ఉంచితే అన్నీ శుభాలే జరుగుతాయని వాస్తు నిపుణులు ఒత్తి మరీ చెబుతున్నారు.ఈ ఎరోవానా చేపను ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి, అష్టైశ్వర్యాలు, శక్తికి సంకేతంగా, చిహ్నంగా భావిస్తారు.


Telugu Arowana Fish, Fish, Nees, Happinses, Negatie, Energy-Latest News - Telugu

ఈ చేప నెగటివ్, చెడు ఎనర్జీ లను లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీ ని ఇంట్లో నింపుతుందని వాస్తు నిపుణులను చెబుతున్నారు.దీని వల్ల అంతా మంచే జరుగుతుందట.అయితే చేప ను ఇంట్లో పెంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు బంగారు ఎరోవానా చేప విగ్రహం చేయించుకొని… దాని నోట్లో ఓ నాణేన్ని ఉంచి.

  ఇంట్లోని ఈశాన్య మూల ఉంచేతే చాలు.సంపద పెరిగిపోతుంది.అలాగే ఈ చేప భూకంపాలను ముందే కనిపెడుతుందని జపాన్ ప్రజలు చెబుతుంటారు.ఏది ఏమైనా శుభం జరుగుతుందని ఈ చేప ను ప్రజలు బాగా కొనేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube