యాక్షన్ హీరోకి వీపు విమానం మోత చేసిన ఆగంతకుడు  

దక్షిణాఫ్రికాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కి చేదు అనుభవం. .

Arnold Schwarzenegger Drop-kicked At South Africa Event-

హాలీవుడ్ కండల హీరో, అనేక హిట్ చిత్రాలలో నటించి స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు.పరిచయం అక్కరలేని పేరు అతనిది.70 ఏళ్ల వయసులో కూడా కండలు తిరిగిన భారీ శరీరంతో కనిపించే ఆర్నాల్డ్ అమెరికాలో ఒక రాష్ట్రానికి మేయర్ గా కూడా చేసాడు.మళ్ళీ ప్రస్తుతం సినిమాలో ఆర్నాల్డ్ బిజీగా ఉన్నాడు..

Arnold Schwarzenegger Drop-kicked At South Africa Event--Arnold Schwarzenegger Drop-kicked At South Africa Event-

ఇదిలా ఉంటే ఆర్నాల్డ్ కి దక్షిణాఫ్రికాలో ఓ చేదు అనుభవం ఎదురైంది.

జొహానెస్‌బర్గ్‌లో ఆర్నాల్డ్‌ క్లాసిక్‌ ఆఫ్రికా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.అక్కడ అభిమానులతో సందడి చేస్తూ బిజీగా స్నాప్‌చాట్‌ వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు.

ఇంతలో ఓ వ్యక్తి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్నాల్డ్‌ను కాలితో ఎగిరి తన్ని కిందపడిపోయాడు.దాంతో అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే దాడికి దిగిన వ్యక్తిని అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోయారు.ఈ సంఘటనపై ఆర్నాల్డ్ కూడా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి స్పందించారు.

తనను ఎవరో బలంగా వెనక నుంచి తన్నారని వీడియో చూస్తే కానీ తనకి తెలియలేదు.ఆ ఇడియట్‌ నా స్నాప్‌చాట్‌ వీడియోను పాడుచేయనందుకు సంతోషంగా ఉంది అంటూ సరదాగా కామెంట్ పెట్టారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.