మంచులో వృద్ధురాలిని కాపాడిన సైనికులు.. ఎలా అంటే?  

army soldiers carry ailing woman on shoulders for 8 km, Bandipora (Jammu and Kashmir), Buthu village , ailing woman, indian army, - Telugu Ailing Woman, Bandipora (jammu And Kashmir), Buthu Village, Indian Army

సైనికులు అంటే మనకు రక్షణగా ఉంటూ, వాళ్ల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా,వాళ్ళ కుటుంబాలను విడిచి మన దేశ రక్షణ కోసం దేశ సరిహద్దున నిద్రాహారాలు మాని మనల్ని కాపాడుతుంటారు.ప్రతి ఒక్కరిని నా అనుకుంటూ జాతి, మత బేధాలు లేకుండా అందరిని తమ గుప్పెట్లో జాగ్రత్తగా దాచుతుంటారు.

TeluguStop.com - Army Soldiers Carry Ailing Woman On Shoulders For 8 Km

ఇటీవలే సైనికులు ఓ వృద్ధురాలిని కాపాడిన వైనం అందరితో సెల్యూట్ చేసేలా ఉంది.

జమ్మూకాశ్మీర్ లో బాందీపూరాలో ఓ 74 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య సమస్యతో బాధ పడుతుంది.

TeluguStop.com - మంచులో వృద్ధురాలిని కాపాడిన సైనికులు.. ఎలా అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

తను, తన భర్త.విపరీతమైన మంచు కురవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బుథు అనే గ్రామంలో చిక్కుకుపోయారు.

ఆ వృద్ధురాలి భర్త ఏమి చేయలేని స్థితిలో.బుథు ఆర్మీ క్యాంపు కు ఫోన్ చేసి విషయం తెలిపాడు.

దీంతో ఆ ప్రాంతానికి చెందిన సైనికులు వాళ్లు ఉన్న చోటుకు వెళ్ళారు.ఆ వృద్ధురాలిని స్ట్రెచర్ పై పడుకోబెట్టి.

తమ భుజాలపై మోస్తూ దాదాపు ఎనిమిది కిలోమీటర్ల వరకు ప్రయాణించి.ఆ తర్వాత వాహనం ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కాగా ఆ వృద్ధ జంట నివసించే ప్రాంతం నుండి తమ జిల్లాకు సంబంధించిన ఆస్పత్రి కు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.దీంతో ఆ ప్రాంతం చుట్టూ వాహన సదుపాయాలు లేక జవానులు ఆ వృద్ధురాలిని 8 కిలోమీటర్ల వరకు మోసుకొని వచ్చారు.

కాగా దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నేటి జనులు సైనికుల పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.మనకు ఎంతో సేవ చేస్తున్నా జవాన్లకు మనం ఏమి ఇచ్చినా సరిపోదు.కాబట్టి మనల్ని కాపాడుతున్న సైనికుల కోసం మన చుట్టూ ఉన్న జనాలతో ఐక్యత గా ఉండటమే.

#Bandipora(Jammu #Ailing Woman #Indian Army #Buthu Village

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు