ఆర్మీ డాగ్స్‌ బాంబులను మాత్ర‌మే కాదు... వీటినీ పసిగ‌డ‌తాయి!

సైన్యంలో సైనికులతో పాటు ఆర్మీ డాగ్స్ విశేష‌మైన ర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందిస్తాయి.వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

 Army Dogs Not Just Bombs They Smell These Security People India , Army , Dogs,-TeluguStop.com

జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్, బెల్జియన్ షెపర్డ్స్, గ్రేట్ స్విస్ మౌంటైన్ డాగ్స్ ఆర్మీలో పనిచేస్తాయి. భారత్‌కు చెందిన‌ ముధోల్ హౌండ్‌లను కూడా భద్రతా దళాలు ఉపయోగిస్తున్నాయి.

భారత సైన్యంలోకి చేర్చబడిన ఏకైక భారతీయ జాతి మోధుల్ హౌండ్.మీరట్, షాజహాన్‌పూర్, చండీగఢ్ కేంద్రాల్లో శున‌కాల‌కు శిక్షణ ఇస్తారు.

వీటికి శిక్షణ ఇచ్చేవారిని ఐవీసీలు అంటారు.కుక్కల శిక్షణ కోసం వివిధ కోర్సులు ఉన్నాయి.

వీటిలో బేసిక్ డాగ్ ట్రైనర్స్ కోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం బేసిక్ ఆర్మీ డాగ్ ట్రైనర్స్ కోర్స్ ఉన్నాయి.

అవి కూడా సైన్యంలోని సైనికుల వలె శిక్షణ పొందుతాయి.

తదనుగుణంగా వాటి జీవనశైలి కూడా ఉంటుంది.ఇండియన్ ఆర్మీకి చెందిన ఈ కుక్కలు ట్రాకింగ్, గార్డింగ్, మైన్ డిటెక్షన్, పేలుడు పదార్థాల గుర్తింపు మొద‌లైన ప‌నులు చేస్తాయి.

పదాతిదళంలోని శున‌కాలు పెట్రోలింగ్, హిమపాతం రెస్క్యూ ఆపరేషన్, సెర్చ్ అండ్ రెస్క్యూ, నార్కోటిక్ డిటెక్షన్ వంటి పనులను చేస్తాయి.సైన్యంలో 25 ఫుల్ డాగ్ యూనిట్లు మరియు హాఫ్ యూనిట్లు ఉన్నాయి.

పూర్తి యూనిట్‌లో 24 కుక్కలు మరియు హాఫ్ యూనిట్‌లో 12 కుక్కలు ఉన్నాయి.

Army Dogs Not Just Bombs They Smell These Security People India , Army , Dogs, People, Modhul Hound. Meerut, Shahjahanpur, Chandigarh - Telugu Chandigarh, Modhulhound, Shahjahanpur

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube