సైనికుడిపైనే దాడి చేసిన ఆర్మీ కుక్కలు,సైనికుడు మృతి  

Army Dogs Killed Army Solider-army Officer Give The Food To Dogs,telugu General News,trained Army Dogs

రెండేళ్లుగా ఆలనా పాలనా చూస్తున్న సైనికుడి పై ఆర్మీ కుక్కలు దాడి చేసిన చంపిన ఘటన ఆస్ట్రియన్ ఆర్మీ లో చోటుచేసుకుంది.2017 నుంచి కుక్కల సంరక్షణ చూసుకుంటున్నాడు ఒక సైనికుడు.ప్రతి రోజు కూడా వాటికి ఆహరం అందించడం,వాటి సంరక్షణ చూసుకోవడం అనే పనులు చూసుకుంటూ వస్తున్నాడు.

అదే క్రమంలో గురువారం కూడా కుక్కలు ఉన్న బ్యారక్ లో వెళ్లి వాటికి ఆహరం ఇస్తుండగా ఉన్నట్టుండి ఆ సైనికుడి పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.దీనితో ఆ సైనికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Army Dogs Killed Army Solider-army Officer Give The Food To Dogs,telugu General News,trained Army Dogs Telugu Viral News Army Dogs Killed Solider-army Officer Give The Food To Telugu General News Trai-Army Dogs Killed Solider-Army Officer Give The Food To Telugu General News Trained

గత రెండేళ్లు గా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్న ఆ సైనికుడు పై కుక్కలు ఎందుకు దాడికి తెగబడ్డాయి అన్న విషయం మాత్రం తెలియరాలేదు.అయితే సైనికుడి పై దాడికి పాల్పడిన వాటిలో ఒక కుక్క వయసు ఆరు నెలలు మాత్రమే కావడం విశేషం.

అసలు ఎలా ఈ ఘటన చోటుచేసుకుంది అన్న దానిపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.మరోపక్క సైనికుడి మృతిపై ఆస్ర్టియా ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ వ్యాన్‌ సంతాపం ప్రకటించారు.మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆస్ర్టియా ఆర్మీలో మొత్తం 170 శునకాలు ఉన్నట్లు తెలుస్తుంది.