ఆర్మూరు నుంచి అసెంబ్లీ! రైతుల నిరసన పాదయాత్ర!

నిజామాబాద్ జిల్లాలో రైతులు గత కొద్ది రోజులుగా పంటలకి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఆర్మూర్ డివిజన్ పరిధిలో 14 మండలాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.

 Armoor Farmers Ready To Protest Walk To Assembly-TeluguStop.com

ఇక ఈ రోజు కూడా రైతుల ఆందోళన ఆర్మూర్ లో జరిగింది.తాము పండించిన పంటలకి కనీస మద్దతు ధర అడుగుతూ ఉంటె ఇప్పటి వరకు ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి తమకి హామీ ఇవ్వకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు.

తాజా రైతుల ఆందోళన తెలంగాణ అసెంబ్లీని తాకనుంది.మహారాష్ట్రలో రైతుల నిరసన ర్యాలిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్మూర్ డివిజన్ రైతులు రేపు ఆర్మూర్ నుంచి హైదరాబాద్ లో వున్న అసెంబ్లీ వరకు పాదయాత్రగా నడిచి రావాలని, పాదయాత్ర, నిరసన ర్యాలీ ద్వారా తమ ఆందోళనని తెలంగాణ ప్రభుత్వాన్ని తాకేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు వున్న నేపధ్యంలో రైతుల ఆందోళన ఉదృతం కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకి సిద్ధం అవుతున్నారు.మరి ఈ రైతుల ఆందోళన రేపటికి అయిన తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ని కదిలిస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube