పట్టపగలు పెట్రోల్ బంక్ లో దోపిడీ  

Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh-

ఉత్తర ప్రదేశ్ లో పట్టపగలు దోపిడీ ఘటన చోటుచేసుకుంది.పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న యువకుడిని గన్ తో బెదిరించి మరి ఆగంతకుడు డబ్బులు దోచుకున్నాడు.యూపీ లో ఇలాంటి దారుణాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh- Telugu Viral News Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh--Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh-

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే యూపీ లో ఇలాంటి దోపిడీ ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి.తాజాగా పెట్రోల్ బంక్ సిబ్బంది ని బెదిరించి ఈ విధంగా దోపిడీ కి పాల్పడ్డాడు ఆగంతకుడు.

బైక్ పై బంక్ కు వచ్చిన ఆగంతకుడు నిదానంగా తన వద్ద పిస్టల్ ని తీసి అక్కడ కూర్చున్న పెట్రోల్ బంక్ లో పనిచేసే యువకుడిని బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకొని తిరిగి బైక్ పై ఉడాయించాడు.ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా అక్కడ ఉన్న సీసీ టీవీ లో రికార్డ్ అవ్వడం తో ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh- Telugu Viral News Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh--Armed Men Theft On Petrol Bunk Staff In Aligarh-

అయితే ఆ వీడియో లో దుండగుడికి తోడు మరొకరు కూడా బైక్ పై ఉన్నట్లు తెలుస్తుంది.యూపీ లోని అలీగఢ్ జిల్లా లో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడు ఎవరు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా పట్టపగలు పెట్రోల్ బంక్ లోకి గన్ తో చొరబడి సిబ్బందిని బెదిరించడం స్థానికంగా కలకలం సృష్టించింది.