కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న స్టైలిస్ట్..! మెట్ల మీద నుండి తోసేసి, హాస్పిటల్ లో కూడా చేర్పించకుండా.!     2018-06-05   04:01:49  IST  Raghu V

ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, పారిపోయిన వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్‌ మాజీ పోటీదారు అర్మాన్‌ కోహ్లిపై కేసు నమోదైంది. అతని కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…

స్టైలిస్ట్‌ నీరూ, నటుడు అర్మాన్‌ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు.