మరోసారి మెగాఫోన్ పట్టనున్న యాక్షన్ కింగ్ అర్జున్... హీరోయిన్ గా ఐశ్వర్య అర్జున్?

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన నటుడిగా, విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

 Arjuns Daughter Opposite Vishwak Sen Directed By Action King Arjun , Arjun Daughter , Vishwak Sen , Arjun , Tollywood , Telugu Film Industry , Aishwarya Arjun-TeluguStop.com

ఈయనలో కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా దాగి వున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోని ఈయన మరోసారి మెగాఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అర్జున్ హీరో విశ్వక్ సేన్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.ఈ కథను విశ్వక్ కు వినిపించగా ఇందులో నటించడానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్.

 Arjuns Daughter Opposite Vishwak Sen Directed By Action King Arjun , Arjun Daughter , Vishwak Sen , Arjun , Tollywood , Telugu Film Industry , Aishwarya Arjun-మరోసారి మెగాఫోన్ పట్టనున్న యాక్షన్ కింగ్ అర్జున్#8230; హీరోయిన్ గా ఐశ్వర్య అర్జున్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా ఈ సినిమా అతి త్వరలోనే పట్టా లెక్కనుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో విశ్వక్ సరసన నటించడం కోసం అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకుంటుందని సమాచారం.ఇక హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే ఈయన తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ సినిమా థియేటర్ లో మే 6 వ తేదీ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా కాకుండా విశ్వక్ తన తదుపరి చిత్రం ‘దమ్కీ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఈ సినిమా మాత్రమే కాకుండా మరో మూడు సినిమాలకు విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశ్వక్ కోసం యాక్షన్ కింగ్ అర్జున్ రెడీగా ఉన్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన వారిని పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube