టీజర్‌ టాక్‌ : వర్మ ఆధిత్య వర్మ అయ్యాడు... సేమ్‌ టు సేమ్‌ దించేశారు  

Arjunreddy As Aditya Varma Comming In Tollywood-

తెలుగులో సెన్షేషనల్‌ మూవీగా నిలిచిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే.స్టార్‌ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయికి విజయ్‌ దేవరకొండ ఎదగడానికి ప్రధాన కారణంగా అర్జున్‌ రెడ్డిని చెప్పుకోవచ్చు.ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రీమేక్‌లు తమిళం మరియు హిందీలో తెరకెక్కుతున్నాయి.హిందీలో అతి త్వరలోనే కబీర్‌ సింగ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

Arjunreddy As Aditya Varma Comming In Tollywood--Arjunreddy As Aditya Varma Comming In Tollywood-

ఇక తమిళంలో ఆధిత్య వర్మగా రీమేక్‌ అవుతోంది.

Arjunreddy As Aditya Varma Comming In Tollywood--Arjunreddy As Aditya Varma Comming In Tollywood-

తమిళ రీమేక్‌ ‘ఆధిత్య వర్మ’ టీజర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.మొదట ఈ చిత్రంకు కేవలం వర్మ అనే టైటిల్‌ను అనుకున్నారు.అయితే ఆ టైటిల్‌తో పాటు సినిమా స్క్రిప్ట్‌ మరియు సీన్స్‌ మొత్తం మార్చేశారు.

అర్జున్‌ రెడ్డికి సహాయ దర్శకుడిగా చేసిన గిరీశయ్యను ఆధిత్య వర్మకు దర్శకుడిగా తీసుకున్నారు.ఆయన సినిమాను అర్జున్‌ రెడ్డిలా దించేశాడు.ఉన్నది ఉన్నట్లుగా దర్శకుడు గిరీశయ్య దించేయడం జరిగిందని టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది..

విక్రమ్‌ తనయుడు దృవ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాలి.టీజర్‌ విడుదలైన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మొదలైంది.గతంలో విడుదలైన టీజర్‌ కంటే ఈ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీజర్‌ను కూడా ఉన్నది ఉన్నట్లుగా దించేయడం జరిగింది.తెలుగు టీజర్‌ షాట్స్‌ను తమిళ టీజర్‌కు కూడా ఉపయోగించారు.దాంతో తప్పకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా బిగ్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది...