అర్జున ఫల్గుణ రివ్యూ: టైటిల్‌కు తగ్గట్టుగా కథ.. శ్రీవిష్ణు సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ తేజ మార్ని దర్శకత్వంలో రూపొందిన సినిమా అర్జున ఫల్గుణ.ఇందులో శ్రీ విష్ణు, అమృత అయ్యర్ నటీనటులుగా నటించారు.

 Sri Vishnu Arjuna Phalguna Movie Review And Rating Details, Sri Vishnu, Tollywo-TeluguStop.com

అంతేకాకుండా వీ.కే.నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి శ్రీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటించారు.ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమాకు చైతన్య ప్రసాద్ పాటలు అందించాడు.జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందించారు.

సంగీతాన్ని ప్రియ దర్శన్ బాలసుబ్రహ్మణ్యం అందించాడు.ఇక ఈ సినిమా ఈరోజు ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటివరకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకున్నాడో చూద్దాం.

కథ:

ఇందులో శ్రీ విష్ణు అర్జున్ అనే పాత్రలో నటించాడు.ఇక అర్జున్ గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరికి చెందిన వ్యక్తి.అతను డిగ్రీ చదివాడు.కానీ ఉద్యోగం మాత్రం చేయడు.కేవలం ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయే అతని లోకం.

ఇక తన ఫ్రెండ్ లో ఒకరి తండ్రి వ్యవసాయం కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాడు.కానీ లోన్ సరైన కాలంలో చెల్లించకపోవడంతో తమ ఇల్లు జప్తు చేయడానికి వస్తారు అధికారులు.

ఆ సమయంలో అర్జున్ వారిని  కాపాడుతాడు.ఇక తమ స్నేహితుల అప్పులు తీర్చడానికి అర్జున్ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి రంగంలోకి దిగుతాడు.

ఇక ఆ సమయంలో అర్జున్ ఎదుర్కొనే పరిస్థితులు, ఇంతకూ వారి అప్పు తీరుస్తాడో లేదో అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

శ్రీ విష్ణు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.అమృత అయ్యర్ తన నటనతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.మిగతా నటీనటులందరూ తమ పాత్రలతో కొంతవరకు మెప్పించారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను తీసుకున్నాడు.కానీ ప్రేక్షకులకు అంతగా మెప్పించలేకపోయాడు.

పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నారు.సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ డైరెక్టర్ మాత్రం ప్రేక్షకులను అంతగా కనెక్ట్ చేయకపోవడంతో శ్రీ విష్ణుకు నిరాశ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.

విశ్లేషణ:

ఈ సినిమా కథ కాస్త రొటీన్ గా ఉంది.నిజానికి ఇందులో కొత్తదనం కనిపించలేదు.సినిమా మొత్తం శ్రీ విష్ణు పైనే సాగింది.

కానీ డైరెక్టర్ తేజ మాత్రం ఈ సినిమాను అంతగా హ్యాండిల్ చేయలేకపోయాడు.కామెడీ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్:

శ్రీ విష్ణు నటన, సంగీతం, డైలాగ్స్, కామెడీ టైమింగ్

మైనస్ పాయింట్స్:

కథలో కాస్త కొత్తదనం ఉంటే బాగుండేది.కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.ఎమోషనల్ గా పెద్దగా కనెక్ట్ కాలేదు.

బాటమ్ లైన్:

కథలో కొత్తదనం లేకపోయినా శ్రీ విష్ణు నటన పరంగా ప్రేక్షకులను సినిమా బాగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 2/5

.

Arjuna Phalguna Movie Genuine Public Talk Arjuna Phalguna

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube