టెలివిజన్ లో తుస్సుమన్న నిఖిల్ హిట్ సినిమా  

Arjun Suravaram Disaster Talk in Television, Tollywood, Telugu Cinema, South Cinema, Hero Nikhil, Television Premier - Telugu Arjun Suravaram Disaster Talk In Television, Hero Nikhil, South Cinema, Television Premier, Telugu Cinema, Tollywood

థియేటర్ లో రిలీజ్ అయిన సమయంలో ఎవరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా టెలివిజన్ లో మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటాయి.మంచి ప్రీమియంలో సినిమాని టెలికాస్ట్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో సినిమాని చూస్తారు.

 Arjun Suravaram Disaster Talk In Television

ఈ మధ్య కాలంలో అశ్వద్ధామ సినిమాకి అలాంటి మంచి బజ్ టెలివిజన్ లో వచ్చింది.నిజానికి ఈ సినిమా థియేటర్ లో డిజాస్టర్ అయ్యింది.

అయితే టీవీ ప్రేక్షకులు మాత్రం సినిమాకి భాగానే కనెక్ట్ అయ్యారు.అలాగే కార్తికేయ 90ఎంఎల్ సినిమాకి కూడా అలాగే మంచి రేటింగ్స్ వచ్చాయి.

టెలివిజన్ లో తుస్సుమన్న నిఖిల్ హిట్ సినిమా-Movie-Telugu Tollywood Photo Image

థియేటర్ కి వచ్చేసరికి ఫస్ట్ డే ప్రేక్షకులు టాక్ బట్టి సినిమా హిట్ ఫట్ అనేది ఆధారపడి ఉంటుంది.అయితే టెలివిజన్ కి వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే అంశాలు ఉంటే ఆటోమాటిక్ గా చూస్తారు.

అయితే ఈ విషయంలో నిఖిల్ సూపర్ హిట్ సినిమా అర్జున్ సురవరం లెక్క తప్పింది.నిజానికి ఈ సినిమా థియేటర్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

అనేక అడ్డంకుల తర్వాత చాలా ఆలస్యంగా సినిమా రిలీజ్ అయిన కూడా ప్రేక్షకులు భాగానే ఆదరించారు.కాన్సెప్ట్ బాగుండటంతో ఈ సినిమా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు.అయితే ఈ సినిమాని టెలివిజన్ లో ప్రీమియర్ గా ప్రదర్శించగా ఇక్కడ అనుకున్న స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకోలేకపోయింది.లాక్ డౌన్ సమయంలో ఫ్లాప్ సినిమాలు కూడా మంచి రేటింగ్స్ తెచ్చుకోగా అర్జున్ సురవరం మాత్రం కేవలం 3.80 రేటింగ్స్ తెచ్చుకొని దారుణంగా నిరాశపరిచింది.అయితే ఈ సినిమాని ఎక్కువగానే ప్రమోట్ చేసిన కూడా టెలివిజన్ ప్రేక్షకులు చూడకపోవడం గమనార్హం.

#Hero Nikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Arjun Suravaram Disaster Talk In Television Related Telugu News,Photos/Pics,Images..