అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్... ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ప్రెజెంట్ ట్రెండ్ యూత్ మైండ్ సెట్ కి భాగా సింక్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండకి స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకురాగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఇమేజ్ ని కూడా అమాంతం పెంచేసింది.

 Arjun Reddy Combination To Repeat Soon, Tollywood, Bollywood, South Cinema, Sand-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాని హిందీలో రణబీర్ కపూర్ తో ప్లాన్ చేసుకున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో తమ ఇమేజ్ ని పెంచుకొని ఇప్పుడు పూరీ దర్శకత్వంలో ఫైటర్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతూ ఉండటంతో పాటు కరణ్ జోహార్ లాంటి నిర్మాత భాగస్వామి కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తయ్యి, హిందీలో సందీప్ సినిమా కూడా అయిపోయిన తర్వాత మరో సారి వీరిద్దరు కలిసి సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.దానిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక వీరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఓ బడా నిర్మాత సిద్ధంగా ఉన్నాడని టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube