రేపో మాపో విడుదలవుతుందనుకున్న సినిమా అంతా రీ షూట్‌... అధికారిక ప్రకటన  

  • తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డి సినిమాను మొదట తమిళంలో ఆ తర్వాత హిందీలో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదల అయ్యింది. టీజర్‌ విడుదల కార్యక్రమంకు పెద్ద ఎత్తున అతిథులు కూడా హాజరు అయ్యారు. అంతా బాగుందని భావిస్తున్నారు, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని భావిస్తున్న సమయంలో రీ షూట్‌ అంటూ తమిళ సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి.

  • Arjun Reddy Remake In Tamil Going To Re Shoot Before Day Of Release-Arjun Varma Movie Vijay Devara Konda

    Arjun Reddy Remake In Tamil Going To Re Shoot Before Day Of Release

  • ఏదైనా సినిమా రీ షూట్‌ అంటే ఒక సీన్‌ లేదా కొన్ని సీన్స్‌ అనుకుంటాం. కాని సినిమా మొత్తం రీ షూట్‌ చేయబోతున్నట్లుగా స్వయంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘వర్మ’ సినిమా ఆశించిన స్థాయిలో రాలేదని, తాము ఆ కంటెంట్‌ మొత్తం తొలగించి మళ్లీ రీ షూట్‌ చేయబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. తెలుగులో అర్జున్‌ రెడ్డి స్థాయిలో తమిళంలో అర్జున్‌ రెడ్డి ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయం ఇప్పటి వరకు సినీ చరిత్రలోనే జరగలేదు అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపస్తుంది.

  • Arjun Reddy Remake In Tamil Going To Re Shoot Before Day Of Release-Arjun Varma Movie Vijay Devara Konda
  • ఆ సినిమాకు సంబంధించిన దర్శకుడు, టెక్నీషియన్స్‌, హీరోయిన్‌ ఇలా అందరిని మార్చనున్నారు. కేవలం నిర్మాణ సంస్థ మరియు హీరో దృవ్‌ మినహా మొత్తం కొత్త వారితోనే సినిమా పట్టాలెక్కబోతుంది. బడ్జెట్‌ డబుల్‌ అయినా కూడా దృవ్‌కు మంచి సక్సెస్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సంచలన నిర్ణయం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లోనే కాకుండా ఇండియన్‌ సినీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఇది అర్జున్‌ రెడ్డి విషయం అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా త్వరలోనే మళ్లీ ప్రారంభించనున్నట్లుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది.

  • Arjun Reddy Remake In Tamil Going To Re Shoot Before Day Of Release-Arjun Varma Movie Vijay Devara Konda