అర్జున్ రెడ్డి హీరోయిన్…అస్వస్థత కి కారణం ఇదేనా       2017-09-13   05:11:17  IST  Raghu V

అర్జున్ రెడ్డి చేసిన సంచలనం అంతా ఇంతా కాదు..సినిమా మొత్తంలో హీరో హీరోయిన్స్ కిస్ సీన్స్ ,బోల్డ్ సీన్స్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాతో హీరోయిన్ శాలిని పాండే పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఈ చొట్టబుగ్గల సుందరికి సినిమా ఆఫర్స్ తో పాటు ఓపెనింగ్స్ కోసం కూడా పోటీ పడి మరీ తీసుకెళ్తున్నారు.

తాజా గా ఈమె కర్నూల్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిందట అక్కడ తనకోసం తీవ్రమైన ఎండలో కూడా అభిమానులు వేచి ఉండటం చేసి షాక్ అయ్యిందట.తాజాగా కొన్ని గంటల క్రితం నెల్లూరు లోని ఒక సెల్ షోరూం ఓపెనింగ్ కి వెళ్ళిన శాలిని తీవ్రమైన అస్వస్థతతో ఇబ్బంది పడిందట. వెంటనే ఆమెని స్థానికంగా ఉన్న బొల్లినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్ళి గంట పాటు ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు.ఇలా ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణాలు చెప్పలేదు. అయితే తానూ ఉదయం తీసుకున్న టిఫిన్ వలన ఇబ్బంది పడి ఉండవచ్చు అని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా గుమికూడారు.

డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసిన తరువాత కొల్కొన్న శాలినిని డిశ్చార్జ్ చేసిన సమయంలో తన ముఖానికి తెల్లని గుడ్డ కట్టి బయటకి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ ఓపెనింగ్ కి వస్తున్నప్పుడు శాలిని తన కార్ లో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఒక సెల్ఫి వీడియో తన పేస్ బుక్ ఎకౌంటు లో పోస్ట్ చేసింది కూడా. ఈ లోగ ఇలా జరగడంతో అర్జున్ రెడ్డి సినిమా యూనిట్ ,తన అభిమానులు కంగారు పడ్డారని టాక్ .