సహనటి తో రిలేషన్ షిప్, పెళ్లి కాకుండానే  

Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gives Birth To A Baby Boy-

బాలీవుడ్ హీరో అర్జున్ రాం పాల్ గురించి తెలియని వారు లేరు.అయితే ఇప్పుడు ఆయన చేసిన పనితో మరోసారి పాపులర్ అయ్యారు.ఇంతకీ ఆయన చేసిన పని ఏంటంటే పెళ్లి కాకుండానే ఈ హీరో గారు తండ్రి అయ్యారు...

Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gives Birth To A Baby Boy--Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gives Birth To A Baby Boy-

ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.ఇదివరకే పెళ్లై, భార్య కు విడాకులు ఇచ్చిన అర్జున్ రాం పాల్ మరో మోడల్ బాలీవుడ్ బ్యూటీ గ్యాబ్రియెల్లా తో కలిసి ఉంటున్నాడు.అయితే మీడియా ముందే వారి బంధం గురించి టాపిక్ వచ్చినప్పటికీ ఎప్పుడూ పెద్దగా స్పందించని వారు ఉన్నట్టుండి తన బంధం గురించి బిడ్డతో సహా ప్రపంచానికి తెలిపాడు.

Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gives Birth To A Baby Boy--Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gives Birth To A Baby Boy-

భార్య‌తో అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అతడి జీవితంలోకి గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ వ‌చ్చింది.గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ కలిసే తిరుగుతున్నారు.అయితే ఒక రోజు మాత్రం త‌మ బంధం గురించి గ్యాబ్రియాలానే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే ఇప్పుడు ఆమె ఒక మగబిడ్డకు జన్మనివ్వడం తో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమై పోయింది.

పెళ్లికి ముందే తల్లి అయిన గ్యాబ్రియెల్లాను చూసి అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.భార్య‌తో క‌లిసున్న‌పుడే 2009లో జరిగిన ఓ పార్టీలో అర్జున్ రాంపాల్, గ్యాబ్రియాలా లు తొలిసారిగా కలిసినా అయితే అప్పుడు వారి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లో లేరు.అయితే ఆ పరిచయం కాస్త ముదిరి ఇలా వారి మధ్య రిలేషన్ షిప్ డెవలప్ అయ్యింది.మరీ ముఖ్యంగా అర్జున్ రాంపాల్ తల్లి చనిపోయిన త‌ర్వాత అత‌డికి ఎమోష‌న‌ల్‌గా అండ‌గా నిలవడం తో వీరిబంధం మరింత ముందుకు సాగింది..

అయితే తాజాగా వారి బిడ్డను ఈ లోకానికి పరిచయం చేశారు.

అయితే గ్యాబ్రియెల్లా సౌతాఫ్రికా సంత‌తి అమ్మాయి కాగా ఇక్క‌డ మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్ 2009లో పాల్గొనడానికి వ‌చ్చింది.ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది.తెలుగు లో కూడా ఊపిరి చిత్రంలో నాగార్జున పక్కన డ్యాన్స్ కూడా చేసి మెప్పించింది.

అయితే ఇప్పుడు అర్జున్ రాంపాల్ తో రిలేషన్ షిప్ లో ఉంది ఇప్పుడు ఒక బిడ్డ‌కు జ‌న్మ‌ కూడా ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌ ఇక ఇప్పుడు ఇక్క‌డే ఉంటుందా లేదంటే మ‌ళ్లీ స్వ‌దేశం వెళ్లిపోతుందా అన్న విషయం మాత్రం తెలియదు.