రకుల్ పాప కూడా మ్యూజిక్ ఆల్బమ్ లో ఎంట్రీ ఇచ్చేసింది

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఐదేళ్ళ పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ స్టార్స్ అందరితో ఆడి పాడింది.

 Arjun Kapoor, Rakul Preet Singh Announce Music Video, Bollywood, Tollywood,lates-TeluguStop.com

ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్, సాయి పల్లవి జోరు పెరగడంతో రకుల్ స్పీడ్ తగ్గింది.ఆమె చివరిగా చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా ఒక సినిమాలో నటించిన అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియదు.అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్న బాలీవుడ్ మాత్రం ఈ అమ్మడు ఏకంగా మూడు సినిమాలని లైన్ లో పెట్టింది.

అవి కూడా పెద్ద స్టార్స్ తోనే కావడం విశేషం.జాన్ అబ్రహంతో చేసిన అటాక్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ రెండు సినిమాలలో అజయ్ దేవగన్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే ఈ మధ్య అందాల భామలు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది.

సౌత్ భామలు కూడా ఇప్పుడిప్పుడే ఆ హిందీ ఆల్బమ్ సాంగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా రష్మిక మందన ఓ ఆల్బమ్ సాంగ్ లో సందడి చేసింది.

ఇప్పుడు అర్జున్ కపూర్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ మ్యూజిక్ వీడియో దిల్ హై దీవానాలో కనిపించనుంది.తాజాగా ఈ ఆల్బమ్ సాంగ్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

దర్శక ద్వయం రాధిక రావు- వినయ్ సప్రూ ఇటీవల ముంబైలో చిత్రీకరించిన రొమాంటిక్ డ్యాన్స్ ట్రాక్ ఆద్యంతం ఆకట్టుకోనుందని తెలిసింది.రకుల్ – అర్జున్ జోడీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ పాటకు సంబంధించిన డీటెయిలింగ్ ఇచ్చారు.

పాట మొదటి పోస్టర్ను కూడా పంచుకున్నారు.మ్యూజిక్ ట్రాక్ ఈ ఏడాది ఏప్రిల్ 17 న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube