ఎఫ్ 2 రీమేక్ లో వరుణ్ తేజ్ పాత్ర కోసం అర్జున్ కపూర్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఎఫ్2.ఫ్యామిలీ కామెడీ డ్రామాలు చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో అనిల్ రావిపూడి ఒకప్పటి భార్యాభర్తల గిల్లికజ్జాలని తెరపై వినోదాత్మకంగా ఆవిష్కరించి అందరిని అలరించాడు.

 Arjun Kapoor Play Varun Tej Role In F2 Remake, Tollywood, Bollywood, Bony Kapoor-TeluguStop.com

అవుట్ అండ్ అవుట్ కామెడీతో వచ్చిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.దీంతో సినిమా ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్2కి సీక్వెల్ గా ఎఫ్3 మూవీ చేస్తున్నాడు.మొదటి కథకి కొనసాగింపుగానే ఎఫ్3 ఉంటుందని తెలుస్తుంది.

ఇందులో డబ్బుని కూడా భాగం చేయడంతో మరింత ఫన్ అందించడానికి అనిల్ రెడీ అయ్యాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇలాంటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ కథలకి హిందీలో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అక్కడ రీమేక్ ప్లాన్ జరుగుతుంది.

తెలుగులో వచ్చిన ‘ఎఫ్ 2‘ చిత్రాన్ని బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేస్తున్నారు.

అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ నటిస్తాడు.వెంకటేశ్ పోషించిన పాత్ర కోసం సీనియర్ హీరోని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.

అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు అయితే మంచి టైమింగ్ తో ఫన్ జెనరేట్ చేయగలరని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే వారిని సంప్రదించినట్లు బోగట్టా.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube