కెవ్వు కేక మలైకా ఎంగేజ్మెంట్ జరిగిందా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ తో దుమ్ముదులిపేసిన బాలీవుడ్ భామ మలైకా అరోరా కొన్నాళ్లుగా అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.తన కన్నా 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడ్డది మలైకా.

 Arjun Kapoor Malaika Engagement Done-TeluguStop.com

సల్మాన్ తమ్ముడు అర్భజ్ ఖాన్ ను పెళ్లాడిన మలైకా అతనికి డైవర్స్ ఇచ్చింది.అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా తన చేతికి వేలికి రింగ్ చూపిస్తూ ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వెళ్లడించింది.

అయితే అర్జున్ కపూర్, మలైకాల ఎంగేజ్మెంట్ పిక్స్ ఏవి సోషల్ మీడియాలో లీక్ అవలేదు.కాని అమ్మడు మాత్రం రింగ్ చూపిస్తూ ఇది చాలా స్పెషల్ రింగ్ అంటూ కామెంట్ పెట్టింది.

 Arjun Kapoor Malaika Engagement Done-కెవ్వు కేక మలైకా ఎంగేజ్మెంట్ జరిగిందా..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జున్ కపూర్, మలైకాల పెళ్లి ఎప్పటినుండో అనుకుంటున్నదే త్వరలోనే వారిద్దరు ఒకటవుతారని ఎప్పటినుండో చెబుతున్నారు.మీడియా హడావిడి చేయడం తప్ప వారు మాత్రం వారి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మలైకా పెట్టిన రింగ్ ఫోటో చూస్తే మాత్రం అర్జున్, మలైకాల ఎంగేజ్మెంట్ జరిగినట్టుగానే అనిపిస్తుంది. తన సోషల్ బ్లాగుల్లో రింగ్ ఫోటోని పెట్టి హల్ చల్ చేస్తుంది మలైకా.

#MalaikaArora #Arjun Kapoor #MalaikaArora #ArjunKapoor #Engagement

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు