అఫిషియల్ : పవన్ 'ఓజి'లో మరో యంగ్ నటుడు.. సరైన ఎలివేషన్ పడితే నెక్స్ట్ లెవల్!

Arjun Das In Pawan Kalyan Sujeeth OG , Director Sujeeth, OG Movie, Pawan Kalyan, Thaman, OG Update, Arjun Das

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి వరుస సినిమాలను పూర్తి చేస్తూ పోతున్నాడు.ఇప్పటి వరకు రాజకీయాలకు స్వల్పంగా బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తూ ఉన్న పవన్ మరికొద్ది రోజుల్లో మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారబోతున్నాడు.

 Arjun Das In Pawan Kalyan Sujeeth Og , Director Sujeeth, Og Movie, Pawan Kalyan,-TeluguStop.com

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి” ( OG ) ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.

వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక యంగ్ అండ్ ఫేమస్ నటుడు ఉన్నట్టు సమాచారం.

తమిళ్, తెలుగు ఆడియెన్స్ లో మంచి బేస్ వాయిస్ తో పాటు ఫేమ్ కూడా ఉన్న నటుడు అర్జున్ దాస్ ( Arjun Das ) ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇదే విషయాన్నీ నిజం చేస్తూ మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఇతడు ఓజి సినిమాలో భాగం అయినట్టు కన్ఫర్మ్ చేసారు.

ఒక పోస్టర్ రిలీజ్ చేసి వెల్కమ్ చెబుతూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సాలిడ్ అనౌన్స్ మెంట్ చేసారు.ఇతడి వాయిస్ లో పవన్ పై మంచి ఎలివేషన్ పడితే ఈ సినిమా వేరే లెవల్లో ఉంటుంది అని పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.చూడాలి ఈ కాంబోలో సన్నివేశాలు ఎంత హైప్ పెంచుతాయో.కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ ( Thaman ) సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube