నామినేట్ చేసిన సోహైల్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన అరియానా!  

ariyana tortures sohail in baby day care task! ariyana, sohail, baby day care task, latest news, bigg boss 4, bigg boss telugu, latest news, nagarjuna - Telugu Ariyana, Baby Day Care Task, Bigg Boss 4, Bigg Boss Telugu, Latest News, Nagarjuna, Sohail

బుల్లితెర బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా పూర్తి అయింది.

TeluguStop.com - Ariyana Tortures Sohail In Baby Day Care Task

అమ్మ‌ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్‌, మోనాల్‌లు ఈ వారం నామినేష‌న్‌లో ఉన్నారు.ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల‌కు బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు.

అదే బిబి డే కేర్‌ సెంటర్ టాస్క్‌.ఈ టాస్క్‌లో సోహైల్, మోనాల్, నోయల్, అఖిల్, అభిజీత్‌లు కేర్ టేకర్స్‌గా.

TeluguStop.com - నామినేట్ చేసిన సోహైల్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన అరియానా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అవినాష్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, హారిక‌లు పిల్ల‌లుగా ఎంపిక చేశారు.
పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు.

కేర్‌ టేకర్స్ కోపం తెచ్చుకోకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.అలాగే పిల్ల‌ల‌కు కేర్ టేక‌ర్స్ అన్నం తినిపించాలి, చ‌దువు చెప్పాలి, బ‌ట్ట‌లు, డైప‌ర్లు మార్చాలి అని బిగ్ బాస్ తెలిపారు.

చివ‌ర‌కు ఈ టాస్క్‌లో ఒక‌రు విజేత అవుతార‌ని.వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని తెలిపారు.

ఇక లాస్య ఈ టాస్క్‌లో సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది.
అయితే టాస్క్ ప్రారంభం కాగానే పిల్ల‌లు రెచ్చిపోయారు.

తెగ అల్ల‌రి చేస్తూ.కేర్ టేక‌ర్స్‌కు పిచ్చెక్కించేశారు.

ముఖ్యంగా ఈ వారం త‌న‌ను నామినేట్ చేసిన సోహైలే త‌న‌కు కేర్ టేక‌ర్ అవ్వ‌డంతో.అరియానా అత‌డికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది.

సొహైల్‌ మీదకు ఎక్కి చల్‌ చల్‌ గుర్రం ఆడుకుంది.సొహైల్‌ని నాన్న నాన్న అంటూ బాగా ఆడేసుకుంది.
నాన్న అని పిల‌వ‌ద్ద‌ని సోహైల్ ఎంత చెప్పినా. అరియానా మాత్రం నాన్న.నాన్న అమ్మ ఎక్క‌డా? అంటూ ఆట‌ప‌ట్టించింది.అలాగే అరియానా భుజాల‌పై ఎక్కించుకుని హౌస్ అంతా సోహైల్ తిప్ప‌గా.

ఆమె మాత్రం అత‌డి ముఖానికి రంగు పూస్తూ, త‌ల‌పై నారింజ తొక్క‌లు వేసి, పిల‌క వేసి నానా తిప్పులు పెట్టింది.మొత్తానికి త‌న‌ను నామినేట్ చేసిన సోహైల్‌ను ఓ రేంజ్‌లో టార్చ‌ర్ చేసింది.

ఇక మిగిలిన పిల్ల‌లు కూడా అల్లరి పనులతో గోల గోల చేసి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేశారు.మ‌రి ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

#Ariyana #Sohail #Nagarjuna #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ariyana Tortures Sohail In Baby Day Care Task Related Telugu News,Photos/Pics,Images..