అరియానా సీక్రెట్ బయటపెట్టిన సోహైల్.. ఏమైందంటే..?

బుల్లితెర రియాలిటీ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరిగి నాలుగు నెలలైనా ఆ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో కోపంగా ఉంటూ సోహైల్ గుర్తింపును సొంతం చేసుకుంటే టాస్కులను అద్భుతంగా ఆడుతూ ఆరియానా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Ariyana Sohel Photo Goes Viral In Social Media , Ariyana, Sohel, Big Boss, Socia-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో అరియానా సోహైల్ మధ్య చాలాసార్లు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అరియానా, సోహైల్ మంచి స్నేహితులుగా మారారు.

బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూమ్ లో రెండు రోజులు ఉన్న అరియానా, సోహెల్ టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచారు.అరియానా ప్రైజ్ మనీ గెలవలేకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగా సోహైల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో తీసుకున్న నిర్ణయం వల్ల 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అతని సొంతమైంది.

తరచూ ఈ జంట పార్టీలు చేసుకుంటుండగా తాజాగా సోహైల్ అరియానాకు సంబంధించిన ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు.అరియానా గ్లోరీతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసిన సోహైల్ హైట్ గా కనిపించడం కోసం అరియానా తెగ కష్టపడుతోందని కొంద కింద మాత్రం అస్సలు చూడకండని చెప్పుకొచ్చారు.

త్వరలోనే అరియానా మణికొండకు షిఫ్ట్ కానుందని వెల్ కమ్ టు మణికొండ బ్యాచ్ అంటూ సోహైల్ పోస్ట్ లో పెట్టారు.

అరియానా హైట్ తక్కువని చెబుతూ సోహైల్ ఆమె పరువును తీసేశారు.

మరోవైపు సోహైల్, అరియానాకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.ప్రస్తుతం అరియానా, సోహైల్ వేర్వేరుగా నటిస్తున్న సినిమాలు హిట్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో అరియానా, సోహెల్ విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube