అరియానాకు ఆ మాత్రం లోకజ్ఞానం కూడా లేదా.. చిన్నపిల్లలకు కూడా తెలుసంటూ?

ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అరియానా గ్లోరీ బిగ్ బాస్ షో సీజన్4 ద్వారా మరింత పాపులర్ అయ్యారు.బిగ్ బాస్ షో సీజన్4 లో టాప్ 4 కంటెస్టెంట్లలో అరియానా గ్లోరీ ఒకరుగా నిలవగా బిగ్ బాస్ షో తర్వాత అరియానాకు సినిమాలలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

 Ariyana Shocking  Behavior Details Here Trolling On Social Media  Ariyana , Bigg-TeluguStop.com

అయితే అరియానా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.

అయితే బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొని సందడి చేస్తున్న అరియానా గ్లోరీ తాజాగా ఒక విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

తాజాగా బిగ్ బాస్ షోలో ఒక టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ ప్రకారం ఆవు బొమ్మ నుంచి పాలను బాటిళ్లలో నింపాలి.అయితే అరియానా ఆవులతో పాటు గేదెలు కూడా పాలు ఇస్తాయా? అని అడిగి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.శివను అరియానా అలా అడగటంతో ఆశ్చర్యపోవడం మిగతా వాళ్ల వంతైంది.

Telugu Anchor Shiva, Ariyana, Biggboss, Behavior, Tollywood-Movie

అరియానాకు ఆ మాత్రం లోకజ్ఞానం కూడా లేదా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అరియానా అడిగిన ప్రశ్నకు సమాధానం చిన్నపిల్లలకు కూడా తెలుసని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అరియానా తెలివితేటల గురించి కొంతమంది నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.

ఈ ట్రోల్స్ గురించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియానా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.మరోవైపు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటివరకు ఏ లేడీ కంటెస్టెంట్ కూడా విన్నర్ గా నిలవలేదనే సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షో ఓటీటీతో ఈ సెంటిమెంట్ కూడా బ్రేక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి బిగ్ బాస్ ఓటీటీతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ ఓటీటీ ఫ్లాప్ షో అని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube