సోహెల్ సంగతి చుస్తానన్న అరియానా.. అసలేం జరిగిందంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా అరియానా, అవినాష్ మంచి ఫ్రెండ్స్ అయిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ అరియానా జంట అందించిన ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.

 Ariyana Romantic Dance With Sonhel Infront Of Avinash Comedy Stars Promo-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ప్రసారమవుతుండగా ఈ షోలో అవినాష్ స్కిట్స్ లో అప్పుడప్పుడు అరియానా గెస్ట్ గా హాజరవుతున్నారు.ఈ వారం ప్రోగ్రామ్ కు అరియానాతో పాటు బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ సోహెల్ కూడా గెస్ట్ గా హాజరయ్యారు.

అవినాష్ స్కిట్ లో భాగంగా హీరోగా సోహెల్ ఎంట్రీ ఇస్తాడు.సోహెల్ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడగగా అవినాష్ అరియానా సార్ అని చెబుతాడు.సోహెల్ వెంటనే నేను చెయ్యా.నేను చెయ్యా అని చెబుతాడు.

 Ariyana Romantic Dance With Sonhel Infront Of Avinash Comedy Stars Promo-సోహెల్ సంగతి చుస్తానన్న అరియానా.. అసలేం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవినాష్ సింగరేణి ముద్దు బిడ్డ కథ వేరే ఉంటుంది అని పొగడగా ఆ పొగడ్తలకు సంతోషపడుతున్నట్టు సోహెల్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు.ఆ తరువాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను పాటతో అరియానా ఎంట్రీ ఇస్తుంది.

అవినాష్ అరియానాను చూపిస్తూ అసిస్టెంట్ తో అదేంట్రా.! అగ్గిపుల్ల అనగానే అగ్గిపుల్ల వచ్చింది అంటూ పంచ్ వేయగా యాంకర్ వర్షిణి, జడ్జీలు శేఖర్ మాస్టర్, శ్రీదేవి పకపకా నవ్వుతారు.ఆ తరువాత స్కిట్ లో భాగంగా అరియానా సోహెల్ సంగతి చెబుతానని అంటుంది.సోహెల్ అరియానాతో నువ్వు ఏం చెప్పలేవ్.చప్పుడు చేయకుండా కూర్చో అంటూ పంచ్ వేస్తాడు.అరియానా అప్పుడు టార్చర్ ఎక్కువ పెట్టలేకపోయానురా ఇప్పుడు రారా నీ సంగతి చూసుకుంటాను అని అంటారు.

అవినాష్ వాళ్లిద్దరి గొడవను ఆపడానికి ప్రయత్నిస్తే నువ్వు పక్కకు జరగవయ్యా అంటూ సోహెల్ అవినాష్ ను తోసేస్తాడు.ఆ తరువాత 7/జీ బృందావన కాలనీ సినిమాలోని జనవరి మాసం పాటకు సోహెల్, అరియానా రెచ్చిపోయి స్టెప్పులేస్తారు.

ఆ సమయంలో అవినాష్ ముఖం మాడిపోయినట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు.

#Bigg Boss 4 #ComedyStars #Promo #SohelRomantic #Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు