అరియానా ఆకలి కష్టాలు.. అన్నం కోసం దొంగతనంగా..?  

ariyana reveals her struggling days in bigg boss show, Akkineni nagarjuna, Akhil, Abhijith, Ariyana, Monal, Ariyana Boy Friend, Harika - Telugu Ariyana Glory, Bigg Boss Show, Struggling Days, Vinay

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని వారంవారంకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా మారుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ.గత రెండు రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో షో ఎమోషనల్ గా సాగుతోంది.

TeluguStop.com - Ariyana Reveals Her Struggling Days In Bigg Boss Show

నిన్నటి ఎపిసోడ్ లో అరియానాను కలవడానికి ఆమె స్నేహితుడు వినయ్ వచ్చాడు.వినయ్ ను చూడగానే అరియానా గుక్కపట్టి ఏడ్చేసింది.

మొదట తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారో రారో అని టెన్షన్ పడిన అరియానా వినయ్ ఇతర కంటెస్టంట్లతో మాట్లాడుతూ తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడవద్దని సూచించింది.ఆ తరువాత తన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం గురించి వినయ్ ను అడిగి తెలుసుకుంది.

TeluguStop.com - అరియానా ఆకలి కష్టాలు.. అన్నం కోసం దొంగతనంగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అరియానా వినయ్ తో నువ్వు బిగ్ బాస్ కు వెళితే డొక్కు కారు అద్దెకు తెచ్చి డ్యాన్స్ చేయిస్తా అని చెప్పావని అనగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని వినయ్ తెలిపారు.

ఆ తరువాత తనకు కొన్ని వస్తువులు కావాలంటూ ఆ వస్తువుల జాబితాను అరియానా చెప్పుకొచ్చింది.ఆ తరువాత వినయ్ తనకు చిన్న వయస్సు నుంచి మంచి స్నేహితుడిని తనకు ఎలాంటి కష్టం వచ్చినా వినయ్ తప్పక సహాయం చేసేవాడని.9వ తరగతిలో వినయ్ తో పరిచయం ఏర్పడిందని అరియానా ఇంటిసభ్యులతో అన్నారు.ఇంట్లో అన్నం లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి అన్నం తినేదాన్ని అంటూ అరియానా తన ఆకలి కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

వినయ్ కు తాను ఎంతో రుణపడి ఉన్నానని.

ఐలవ్యూ వినయ్ అని అరియానా అన్నారు.వినయ్ వెళ్లిపోయిన తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అరియానాను ఓదార్చారు.

ఆ తరువాత బిగ్ బాస్ మోనాల్ అమ్మ వాయిస్ వినిపించారు.మోనాల్ తల్లి హైదరాబాద్ కు రాలేకపోయామని చెప్పడంతో మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది.

ఆ తరువాత మోనాల్ సోదరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

#Ariyana Glory #Struggling Days #Bigg Boss Show #Vinay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ariyana Reveals Her Struggling Days In Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..