మోనాల్ కోసం అరియానా త్యాగం.. క్లాస్ పీకిన నాగార్జున‌?

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది.ఇంటి స‌భ్యులంద‌రూ మంచి ఫామ్‌లోకి వ‌చ్చి త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతూ.

 Ariyana Helps Monal Gajjar In Bigg Boss 4! Ariyana, Monal Gajjar, Bigg Boss 4, B-TeluguStop.com

బిగ్ బాస్ ఇంటిని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేస్తున్నారు.ఇక నిన్న శ‌నివారం కావ‌డంతో హోస్ట్ నాగార్జున వ‌చ్చి.

ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేయ‌డంతో పాటు కొంద‌రికి క్లాస్ కూడా పీకారు.అలాగే నామినేష‌న్స్‌లో ఉన్న ఇంటి స‌భ్యుల్లో కొంద‌రిని సేవ్ చేశాడు.

అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్ గ‌జ్జ‌ర్ కోసం అరియానా ఓ త్యాగం చేసింది.ఈ వారం కెప్టెన్సీ పోటీ దారుల కోసం ‘అమీతుమీ’ పేరుతో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ టాస్క్‌లో బిగ్ బాస్ ఓ డీల్ ఇచ్చారు.ఒక ఇంటి సభ్యుడు బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు జ్యూట్‌తో అల్లిన బట్టలను ధరించి ఉండాలి.

ఈ డీల్ చేసేందుకు మోనాల్ ముందుకు వ‌చ్చి పొట్టి జ్యూట్ బట్టల‌ను ధ‌రించింది.

అయితే గతవారం రోజులుగా జ్యూట్‌తో అల్లిన డ్రెస్‌లోనే ఉంటున్న మోనాల్‌కి విముక్తి కల్పించే డీల్‌ను నిన్న‌టి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇచ్చారు.

ఈ ఒక్క‌రోజు మోనాల్‌కు బ‌దులుగా. ఆమె బ్లూ టీమ్‌లో ఉన్న వారు ఆ డ్రెస్ వేసుకోవాలని అన్నారు.

అలా వేసుకుంటే మోనాల్ డ్ర‌స్ మార్చుకోవ‌చ్చ‌ని తెలిపారు నాగార్జున‌.దీంతో అరియానా ముందుకు వ‌చ్చి జ్యూట్ అల్లిన డ్రెస్‌ను ధ‌రించి.

మోనాల్‌కు విముక్తి క‌ల్పించింది.

ఇక మ‌రోవైపు సోహైల్ విష‌యంలో అరియానాకు గ‌ట్టి క్లాస్ పీకారు నాగార్జున‌.

సోహైల్ కోపాన్ని గెలిచేశాడ‌‌ని ప్ర‌శంసించారు.కోపం వ‌చ్చిన‌ప్ప‌టికీ దాన్ని కంట్రోల్ చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని నాగ్ చెప్పుకొచ్చాడు.

అయితే అత‌డిని పొగ‌రు అన్న అరియానాను నాగ్ నిల‌దీశారు.సోహైల్‌ వచ్చి సారీ చెప్పాడు.

మరి నువ్వు చెప్పవా అని అరియానాను ప్రశ్నించాడు.దీంతో ముందు చెప్ప‌ను అని వాదించిన అరియానా చివ‌ర‌కు సోహైల్‌కు సారీ చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube