గోవా బీచ్ లో రచ్చ చేస్తున్న అరియానా.. ఫోటో వైరల్..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్లలో అరియానా ఒకరు.ఆర్జీవీతో ఇంటర్వ్యూల ద్వారా యాంకర్ గా పాపులారిటీని సంపాదించుకున్న అరియానా బిగ్ బాస్ షోలో టాస్కులు బాగా ఆడుతూ టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచారు.

 Ariyana Goa Beach Enjoying Photos Goes Viral In Social Media, Ariyana, Bigg Boss-TeluguStop.com

అరియానా విన్నర్ లేదా రన్నర్ అవుతుందని చాలామంది భావించినా ఆర్జీవీ మినహా సెలబ్రిటీలు ఎవరూ అరియానాను సపోర్ట్ చేయకపోవడం ఆమెకు మైనస్ గా మారింది.

అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రం అరియానాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో అరియానా నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో అరియానా పాత్ర గురించి తెలియాల్సి ఉంది.మరోవైపు స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ద్వారా కూడా అరియానా ఆకట్టుకుంటున్నారు.అరియానా వ్యక్తిత్వం చాలామందికి నచ్చడంతో ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగింది.

అయితే అరియానా ప్రస్తుతం గోవా బీచ్ లో రచ్చరచ్చ చేస్తున్నారు.అరియానా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా గోవా బీచ్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు.గోవా వేల్ బీచ్ లో దిగిన ఫోటోను అరియానా షేర్ చేయగా అరియానా ఫోటోలో క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.శ్రీముఖి గ్యాంగ్ తో కలిసి అరియానానా గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది.

అరియానా షార్ట్ డ్రెస్ లో కొత్త లుక్ లో కనిపించారు.

అరియానా రాజ్ తరుణ్ తో కలిసి నటిస్తున్న సినిమా హిట్తైతే మాత్రం అరియానా హీరోయిన్ గా కూడా వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube