నా రక్తంలో అలాంటి లోపం.. హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న అరియనా?

స్టార్ మా లో ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్ లో ఒకరు అరియనా.బోల్డ్ అంటూ చివరి వరకు పాల్గొని ఒక మంచి గుర్తింపు అందుకుంది.

 Ariyana Glory Request To Mehaboob Dilse And Syed Sohail Ryan For Blood Donation,-TeluguStop.com

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఎంతో సరదాగా గడుపుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రస్తుతం పరిస్థితుల గురించి కొన్ని విషయాలు ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారా పంచుకుంది అరియనా.అంతేకాకుండా తనతో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్ లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలు పంచుకున్న అరియానా.ఇటీవలే తను ఓ కొత్త ఇంటిలోకి మారాను అని తెలిపింది.మణికొండకు తన ఇంటిని షిఫ్ట్ చేశాను అంటూ.ఇల్లు మారిన సమయంలో తనకు భయం వేసిందని తెలిపింది.

ఇక 18 ఏళ్లకు పైబడినవారు వ్యాక్సిన్ వేయించుకున్న అర్హత ఉంటే తాను కూడా వేయించుకున్నాను అని తెలిపింది.ఇక ప్రస్తుతం తనకు భయం లేదని.

ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం చెబుతున్నాను అని తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న 60 రోజుల తర్వాత బ్లడ్ డొనేట్ చేయరాదు అనే విషయాన్ని తెలిపింది.

కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరైనా బలంగా ఉన్న వాళ్ళు.పైగా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్లు కూడా డొనేట్ చేశాకే వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపింది.

ఇక తనకు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని ఉందట.కానీ తను ఇప్పుడు చేయలేను అంటూ.

పైగా తన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉందని తెలిపింది.ప్రస్తుతం ఈ ఈ పరిస్థితులలో బ్లడ్, ప్లాస్మా దానం అవసరమని.

కాబట్టి అందరూ వీలైనంతవరకు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రక్తాన్ని దానం చేయండి అంటూ కోరింది అరియనా.

Telugu Ariyana Glory, Bigg Boss, Mehabood, Syed Sohail-Movie

ఇక అంతే కాకుండా తనతో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్ లు మెహబూబ్, సోహైల్ కూడా లైన్ లోకి వచ్చారు.ఇక మెహబూబ్ అరియనా తో కాసేపు ముచ్చటించి.తన రంజాన్ వేడుకల గురించి తెలిపాడు.

ఇక ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్ గురించి మెసేజ్ ఇవ్వమని కోరింది అరియనా.దీంతో వెంటనే స్పందించిన మెహబూబ్.

ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయాలని, మాస్కు ధరించాలని, సరైన దూరం పాటించాలని తెలిపాడు.పైగా థర్డ్ వేవ్ మరింత దారుణంగా ఉందంటూ పిల్లలకు కూడా డేంజర్ అని ఇమ్యూనిటీ పెంచుకోవాలని తెలిపాడు.

ఇక సోహైల్ కూడా ప్రస్తుతం పరిస్థితుల గురించి తెలుపుతూ బ్లడ్ డొనేషన్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఇతరులకు సహాయం చేసి ప్రాణాలు కాపాడండి అంటూ, అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ తెలిపాడు సోహైల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube