బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ అరియానా గ్లోరీకి.. రామ్‌గోపాల్ వ‌ర్మ‌కి లింక్ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే.ఈ సారి బిగ్ బాస్‌లో హోస్ట్ నాగార్జున డ్యూయ‌ల్ రూల్ ప్లే చేస్తూ.

 Bold Anchor Ariyana Glory Popular By Ram Gopal Varma! Bold Anchor Ariyana Glory,-TeluguStop.com

ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.ఈ క్ర‌మంలోనే మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఈ సీజ‌న్‌లో 10వ కంటెస్టెంట్‌గా ఐయామ్ బోల్డ్.ఐయామ్ బోల్డ్.ఐయామ్ బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ అరియానా గ్లోరీ..

ఏవీతోనే ఆక‌ట్టుకుంది.ఇక నీ అస‌లు పేరేంట‌ని నాగ్ అడ‌గ‌గా.

ఆ పేరంటే నాకు భ‌యం అంటూ పేరు చెప్ప‌కుండా త‌ప్పించుకుంది.ఇంత‌కీ ఈమె అస‌లు పేరు మంగలి అర్చన.

స్వ‌స్థ‌లం హైద‌రాబాద్‌.

యాంకర్ అవ్వాలనే ముక్కువ‌తో అరియానా గ్లోరీ చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపేసింది.

దీంతో ఆమె డిగ్రీ ఫెయిల్ అయింది.ప్ర‌స్తుతం ఈమె జెమిని కామెడీలో యాంకర్‌గా ఆక‌ట్టుకుంటోంది.

అలాగే యూట్యూబ్ ఛానెల్‌లో ప‌లువురు సెల‌బ్రెటీల‌ను ఇండ‌ర్వ్యూలు కూడా చేస్తుంటుంది.అయితే ఈమె బోల్డ్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ది మాత్రం.

వివాదాల‌కు కేరాఫ్ అయిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ‌ల్లే అని చెప్పాలి.

అరియానా గ్లోరీకి.

రామ్ ‌గోపాల్ వ‌ర్మకు లింకేటీ అంటే.గ‌తంలో మనస్టార్స్ అనే యూట్యూబ్ చానల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు వ‌ర్మ‌.

ఆ ఇంట‌ర్వ్యూ చేసింది ఎవ‌రో కాదు.ఈ అరియానా గ్లోరీనే.

ఆ ఇంట‌ర్వ్యూలో మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా సార్ అని అరియానా వ‌ర్మ‌ను అడ‌గ‌గా.నిన్ను బికినీలో చూడాలని ఉంది.

నీకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తా వస్తావా.బికినీ వేస్తావా.

అంటూ వ‌ర్మ ఆమెను బోల్డ్ యాంక‌ర్‌గా పాపుల‌ర్ చేశాడు.అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ పాపుల‌ర్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube