ఓవరాక్షన్‌తో చెల‌రేగిపోతున్న‌ అరియానా.. అందుకేనా?  

ariyana glory overaction in bigg boss 4! ariyana glory, overaction, bigg boss 4, bigg boss telugu, latest news, nomination, elimination - Telugu Ariyana Glory, Bigg Boss 4, Bigg Boss Telugu, Elimination, Latest News, Nomination, Overaction

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఆరో వారం పూర్తి చేసుకోబోతోంది.ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతూ.బిగ్ బాస్ హౌస్‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చేస్తున్నారు.అదే స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని ఓట్లు సంపాధించుకునేందుకు స్టాట‌జీతో ముందుకు సాగుతున్నారు.అయితే ఒక్కోసారి ఆ స్టాట‌జీనే బెడిసికొడుతుంటుంది.

TeluguStop.com - Ariyana Glory Overaction In Bigg Boss 4

ఇప్పుడు అరియానా విష‌యంలోనూ అదే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.వాస్త‌వానికి తొలి వారం పిచ్చి పిచ్చి చేష్ట‌ల‌తో విమ‌ర్శ‌ల పాలైనా అరియానా.

తరువాత అనూహ్యంగా పుంజుకుంది.

TeluguStop.com - ఓవరాక్షన్‌తో చెల‌రేగిపోతున్న‌ అరియానా.. అందుకేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా గేమ్ విషయంలో ఫుల్ ఎఫర్ట్ పెడుతూ ఆక‌ట్టుకోవ‌డంతో.

ఆమె నామినేష‌న్‌కు వ‌చ్చినా ప్రేక్ష‌కులు సేవ్ చేస్తున్నారు.అయితే ఈ వారం ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు.

ఎందుకంటే, ఈ వారం అరియానాకు ఏమైందో ఏమో కానీ.ఓవ‌రాక్ష‌న్‌తో చెల‌రేగిపోతుంది.

కొత్త కొత్త వివాదాలు కూడా సృష్టిస్తోంది.ముఖ్యంగా ఈ వారం మొద‌ట‌ల్లో సోహైల్‌తో కావాల‌నే గొడ‌వ‌కు దిగ‌డంతో పాటు.

ఆ విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతూ హైలైట్ అయింది.
ఇక ఎప్పుడైతే నామినేష‌న్‌లో ప‌డిందో.

అప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.ఈ క్ర‌మంలోనే కెమెరాలో ఫోకస్ కావాడానికి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంది.

అవినాష్‌తో త‌ర‌చూ ముచ్చ‌ట్లు పెడుతూ హైలైట్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది.అలాగే ప్ర‌తి విష‌యంలో త‌ల‌దూర్చ‌డంతో పాటు గ‌ట్టి గ‌ట్టిగా అరుస్తూ స్క్రీన్ స్పేస్ కోసం అతి చేస్తోంది.
అయితే ప్రతి దానికి ఓవర్‌గా రియాక్ట్ కావడ‌మే.ఆమెకు మైనస్‌గా మారింద‌ని అంటున్నారు.ఈ క్ర‌మంలోనే నామినేష‌న్‌లో ఉన్న అరియానా డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.మొత్తానికి ఓవ‌రాక్ష‌న్‌తో సేఫ్ అయిపోదామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న అరియానాకు.

ప్రేక్ష‌కులు ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.కాగా, ఈ వారం కుమార్ సాయి, దివి, నోయల్, లాస్య, హారిక, అరియానా, అభిజిత్, మోనాల్, అఖిల్‌లు నామినేష‌న్స్‌లో ఉన్నారు.

#Overaction #Elimination #Ariyana Glory #Bigg Boss 4 #Nomination

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ariyana Glory Overaction In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..