అవినాష్ పెళ్లి పై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ.. హ్యాపీగా ఉందంటూ!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా సందడి చేసిన ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ముక్కు అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా తన నిశ్చితార్థం జరిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

 Ariyana Glory Congratulates Avinash On His Engagement Biggg Boss, Ariyana, Avina-TeluguStop.com

ఇలా ముక్కు అవినాష్ తన పెళ్లి విషయం తెలియజేయడంతో ఇప్పటివరకు తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మాత్రమే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన అవినాష్ అరియానాతో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ ఉందని వీరి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన అరియానా వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి.

Telugu Ariyana, Avinash, Biggg Boss, Tollywood-Movie

ప్రస్తుతం ముక్కు అవినాష్ తాను పెళ్లి చేసుకోబోతున్నానని తాను చేసుకోబోయే అమ్మాయి గురించి తెలియజేయడంతో అవినాష్ పెళ్లి విషయంపై అరియానా స్పందించారు.ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ అవినాష్ కు నాకు మధ్య ఏదో సంబంధం ఉందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే అవినాష్ పెళ్ళితో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది.అవినాష్ కు పెళ్లి ఫిక్స్ కావడం తనకు ఎంతో హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలు టీవీ షోలతో ఎంతో బిజీగా ఉన్న అరియానా బాగా డబ్బు సంపాదించిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube