అరియానాకు ముద్దు పెట్టాల‌నుకున్న‌ అవినాష్‌.. తిక్క కుదిర్చిన‌ గంగ‌వ్వ?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ఐదో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

 Ariyana Glory Complaint On Avinash Bb Hotel Task! Ariyana Glory, Avinash, Bb Hot-TeluguStop.com

ఐదో వారం నామినేష‌న్స్ ఎంత వాడి వేడిగా జ‌రిగాయో కూడా ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌లో సోమ‌వారం ఇంటి స‌భ్యులంద‌రూ చెల‌రేగిపోయారు.

అయితే ఇంటి స‌భ్యుల‌ను కూల్ చేసేందుకు మంగ‌వారం.బిగ్ బాస్ `బిబి గ్రాండ్ హోటల్` టాస్క్ ఇచ్చారు.

కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగే ఈ హోట‌ల్ టాస్కు‌లో.ఇంటి స‌భ్యులు అతిధులు, హోటల్ స్టాఫ్‌గా మారి గేమ్ ఆడాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌లో అతిధులకు సేవ‌లు చేసి.వారి ద‌గ్గ‌ర నుంచి స్టార్స్ పొందాల్సి ఉంటుంది.ఇక ఆ టాస్క్‌ లో భాగంగానే బిగ్ బాస్ అవినాష్‌ కు ఒక సీక్రెట్‌ టాస్క్‌ ను కూడా ఇచ్చాడు.అవినాష్ హోటల్ స్టాఫ్‌లో ఒకరిగా ఉన్నప్పటికీ.

అతిధుల‌కు హోట‌ల్ స్టాఫ్ అందించే సేవ‌ల‌ను పాడుచేయాల‌ని, హోట‌ల్ స్టాఫ్‌కు స్టార్స్ రాకుండా చేయాల‌ని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌.

ఈ క్ర‌మంలోనే మిగిలిన ఇంటి స‌భ్యుల‌కు ఎలాంటి అనుమానం రాకుండా.

అవినాష్ గేమ్ ఆడ‌తాడు.సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్.

హారికను అవమానిస్తాడు.అతిధుల‌కు వండే ఆహారంలో ఎవ‌రికీ తెలియ‌కుండా ఉప్పు వేసేస్తాడు.

అనంత‌రం ప్రిన్సెస్‌ అయిన అరియానా చేయి పట్టుకోవడంతో పాటు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు.దీంతో అరియానా మ‌హారాణి గంగ‌వ్వ వ‌ద్ద‌కు వెళ్లి అవినాష్ త‌న చెయ్యి ప‌ట్టుకున్నాడ‌ని చెప్ప‌డంతో.

కాలు మొక్కు అని అత‌డికి ఆర్డ‌ర్ వేస్తుంది.

ఇక అక్క‌డితో ఆగ‌ని అరియానా.

త‌న‌ను ముద్దు కూడా పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పేస్తుంది.దీంతో అవినాష్ తిక్క కుదిరేలా.

చెంచాతో బకెట్‌ను నీళ్ల‌తో నింప‌మ‌ని శిక్ష విధిస్తుంది.అయితే చివ‌ర‌కు విసుగెత్తిపోయిన అవినాష్‌.

చిల్లరగా ప్రవర్తించకండి అంటూ రాకుమారికి వార్నింగ్ ఇస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తాడు.ఇంత‌లో మేనేజ‌ర్ అఖిల్ రంగంలోకి దిగి అవినాష్‌ను కొట్టిన‌ట్లు చేసి ప‌క్క‌కు తీసుకెళ్తాడు.

మొత్తానికి నిన్న టాస్క్ సరదాగా సాగిపోగా.నేటి ఎపిసోడ్‌లో ఏం జ‌రుగుతుంది అన్న‌ది అస‌క్తిక‌రంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube